‘బిగ్‌బాస్‌’లోకి ఆమె మళ్లీ వస్తుందా? | actor oviya re-entry in bigg boss show | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’లోకి ఆమె మళ్లీ వస్తుందా?

Published Mon, Aug 14 2017 5:57 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

‘బిగ్‌బాస్‌’లోకి ఆమె మళ్లీ వస్తుందా? - Sakshi

‘బిగ్‌బాస్‌’లోకి ఆమె మళ్లీ వస్తుందా?

చెన్నై:  ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశాల్లో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో ఒకటి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా విశ్వనటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాత కావడం ఒకటైతే, అందులో పాల్గొనే తారలు మరొకటి. ముఖ్యంగా నటి ఓవియ కారణంగా బిగ్‌బాస్‌ టీఆర్‌పీ రేటు పెరిగిపోయిందట. దీంతో నిర్వాహకులు పిచ్చ హ్యాపీ అయిపోయారు. మధ్యలో నటి ఓవియ, ఆరవ్‌ల ప్రేమ వ్యవహారం పెద్ద సంచలనానికే దారి తీసింది. ఆ పర్వం కూడా ప్లస్‌ అవుతుందని భావించిన బిగ్‌బాస్‌ నిర్వాహకుల భావన బెడిసి కొట్టింది. ఓవియ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది.

ఆరవ్‌తో ప్రేమ వ్యవహారమే ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేలా చేసిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఓవియ అభిమానులు, సానుభూతి పరులు బిగ్‌బాస్‌ గేమ్‌ షోను చూడటం మానేశారట. ఫలితం బిగ్‌బాస్‌ టీఆర్‌పీ రేటు ఒక్క సారిగా పడిపోయిందంటున్నారు. అంతే కాదు ట్విట్టర్లలో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో పై విమర్శలు పెరుగుతున్నాయట. దీంతో డైనమాలో పడ్డ బిగ్‌బాస్‌ నిర్వాహకులు నటి ఓవియను మళ్లీ గేమ్‌షోలోకి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అందుకు చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం.

ఇంతకు ముందు ఓవియకు వారానికి రూ.2.5 నుంచి రూ.3 లక్షలు పారితోషికం ఇచ్చేవారనీ, ఇప్పుడు తను మళ్లీ తిరిగొస్తే రూ.5 లక్షల వరకూ చెల్లించడానికి బిగ్‌బాస్‌ నిర్వాహకులు సిద్ధం అంటున్నారనీ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? ఒక వేళ నిజం అయితే నటి ఓవియ మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మొత్తం మీద బిగ్‌బాస్‌ నటి ఓవియను పెద్ద సెలబ్రిటీని చేసిందనే అనాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement