రాత్రివేళ ఓవియ ఏం చేసిందో తెలుసా? | oviya what did in night? | Sakshi
Sakshi News home page

రాత్రివేళ ఓవియ ఏం చేసిందో తెలుసా?

Published Fri, Jan 12 2018 2:32 AM | Last Updated on Fri, Jan 12 2018 2:32 AM

oviya what did in night? - Sakshi

తమిళసినిమా:  నటి ఓవియ అంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో పిచ్చి క్రేజ్‌. గత ఏడాది చివరిలో అధికంగా వార్తల్లో నానిన నటి ఈ అమ్మడు. తను నటించిన చిత్రాలు విజయం సాధించడంతో వచ్చిన క్రేజ్‌ కాదది. అంతా బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో పుణ్యం. ఆ షోలో పాల్గొన ఓవియ విన్నర్‌గా నిలబడకపోయినా అంత కంటే ఎక్కువ గుర్తింపునే తెచ్చుకున్నారు. చాలా సహజంగా ప్రవర్తించిన నటిగా ప్రేక్షకుల్లో చాలా మంచి పేరును సంపాదించుకుంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు ఓవియ బాగా దగ్గరైపోయింది.

అంతే కాదు ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం లారెన్స్‌తో కాంచన–3 చిత్రంలో నటిస్తున్న ఓవియ ఇటీవల రాత్రివేళ అనూహ్యంగా చెన్నైలోని ఒక అభిమాని ఇంటికి వెళ్లింది. ఈ ఊహించని ఓవియ ఆగమనానికి ఆ అభిమానితో పాటు ఆ ప్రాత ప్రజలు ఆచ్చెరువు చెందారు. ఓవియ వారందరితో ఫొటోలు దిగి వారిని సంతోషపెట్టడంతో పాటు, కాసేపు వారి పిల్లలతో ఆడి పాడారు.

ఓమయ షడన్‌ విజిట్‌లో అంతరార్థం ఏమై ఉంటుందనే ఆరాను లాగే ప్రయత్నంలో కోలీవుడ్‌ వర్గాలు ఉన్నా, ఈ సంఘటనతో ఓవియ మాత్రం చాలా ప్రచారాన్నే పొందేసింది. తను అభిమానితో,అక్కడి పిల్లలతో దిగిన ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాల్లో  హల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement