కాట్టేరికి టాటానా? | Hansika Motwani will not replace Oviya in 'Katteri' starring Vaibhav | Sakshi
Sakshi News home page

కాట్టేరికి టాటానా?

Published Sun, Dec 31 2017 6:56 AM | Last Updated on Sun, Dec 31 2017 6:56 AM

Hansika Motwani will not replace Oviya in 'Katteri' starring Vaibhav - Sakshi

తమిళసినిమా: కాట్టేరి చిత్రానికి నటి హన్సిక టాటా చెప్పిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ ముంబై బ్యూటీ చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అయ్యిపోయింది. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతో రొమాన్స్‌ చేస్తున్న గులేభాకావళి చిత్రం ఒకటి. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తోంది. శాన్‌ ఆంథోని దర్శకుడు. కాగా వైభవ్‌ కథానాయకుడిగా డీకే. దర్శకత్వంలో స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న కాట్టేరి చిత్రంలో నటించడానికి హన్సిక అంగీకరించింది. ఇది హర్రర్‌ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం. కథ కూడా విని నటించడానికి ఓకే చెప్పిన ఈ భామ తాజాగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది.

 హన్సిక కొత్త సంవత్సరంలో మరో భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతుండడంతో కాట్టేరి చిత్రానికి టాటా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో ముందుగా నటి ఓవియ న టించనుందనే ప్రచారం జరిగింది. ఈ తరువాత ఆమె అవకాశాన్ని హన్సిక కొట్టేసిందన్నారు. తాజాగా ఈ బ్యూటీ కూడా వైదొలిగిందనే ప్రచారం హోరెత్తుతోంది. కాల్‌షీట్స్‌ సమస్య కారణంగానే కాట్టేరికి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. హన్సిక ఐదేళ్లుగా న్యూఇయర్‌ను తన స్నేహితులతో కలిసి న్యూ యార్క్‌లో ఎంజాయ్‌ చేస్తూ వస్తోంది. ఈ సారి ఆ టూర్‌ను కూడా రద్దు చేసుకుందట. చేతి నిండా చిత్రాలుండడంతో హన్సిక ఈ ఏడాది హ్యేపీ న్యూ ఇయర్‌ను ముంబైలోనే తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement