G.O.A.T Movie: నా పాత్ర ఏంటో తెలియ‌కుండా న‌టిస్తున్నా | Vaibhav About Vijay GOAT Movie | Sakshi
Sakshi News home page

గోట్ న‌టుడు హీరోగా కొత్త సినిమా.. ఇది చాలా డిఫ‌రెంట్ అంటూ..

Published Sat, Feb 24 2024 2:03 PM | Last Updated on Sat, Feb 24 2024 2:52 PM

Vaibhav About Vijay GOAT Movie - Sakshi

వైభవ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రణం అరం తవరేల్‌. తాన్య హోప్‌, నందిత శ్వేత, సరస్వతీ మీనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా షరీఫ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ చాయాగ్రహణం, అరోల్‌ కరోలి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం గురించి నటుడు వైభవ్‌ మాట్లాడుతూ.. రణం అరం తవరేల్‌ చిత్రం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. ఇది తాను నటించిన 25వ చిత్రం అని చెప్పారు.

ఇది ఇంతకుముందు నటించిన వాటికంటే కొత్త నేపథ్యంలో రూపొందిన కథా చిత్రమ‌ని పేర్కొన్నారు. కొత్త దర్శకుడైనా చిత్రాన్ని చాలా బాగా తెరపై ఆవిష్కరించారన్నారు. రణం అరం తవరేల్‌ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందనిన్నారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇక‌పోతే ప్రస్తుతం విజయ్‌ హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో గోట్‌ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైం) శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇందులో నటుడు వైభవ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇందులో తన తన పాత్ర ఏమిటో కూడా తెలియకుండా నటిస్తున్నానని చెప్పారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలోనూ తాను ఏదో ఒక పాత్రలో కనిపిస్తాన‌న్నారు. అదే విధంగా ఇంతకుముందు అజిత్‌ హీరోగా నటించిన చిత్రంలో తాను నటించానని, ఇప్పుడు విజయ్‌ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.

చ‌ద‌వండి: రాత్రి అయితే చాలు వాళ్ల ఫోన్‌ కాల్స్‌తో భయమేస్తుంది.. కిరణ్‌ రాథోడ్‌ ఆవేదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement