
అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'మాస్' సినిమా రీ-రిలీజ్ కానుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి 4k వర్షన్‌లో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కించిన 'మాస్' సినిమా 2004లో విడుదలైంది. సుమారు 20 ఏళ్ల తర్వాత.. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు ఆగష్టు 28న రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జ్యోతిక, చార్మికౌర్, రఘువరన్, ప్రకాష్‌రాజ్, రాహుల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆరోజుల్లో నాగార్జునకు అత్యధిక వసూళ్లు అందించి రికార్డు సృష్టించింది.