Ravi Teja Khiladi Movie Release Date, దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ - Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌

Published Sat, Jan 30 2021 4:37 PM | Last Updated on Tue, Jun 1 2021 10:32 AM

Ravi Teja Khiladi Movie Release Date Announced - Sakshi

మాస్‌ మహారాజ్‌ రవితేజ‌ ఫుల్‌ ఫామ్‌‌లో కనిపిస్తున్నాడు. ఆయన నటించిన క్రాక్‌ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే జోష్‌లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్‏లో నటించనున్నాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఖిలాడి షూటింగ్ జరుపుకోంటుంది. చదవండి:‘ రవితేజ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లట!‌

తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్ర యూనిట్‌. మే 28న థియేటర్లలలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చేతిలో‌ గన్‌ పట్టుకొని రవితేజ నడుచుకుంటూ వస్తున్న కొత్త పోస్టర్‌ను పరిచయం చేస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మే 28 నుంచి ఖిడాడీ రిలీజ్‌ కానుంది’ అని రవితేజ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక అదే నెలలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య(మే13), వెంకటేష్‌ నటిస్తున్న నారప్ప(మే 14) చిత్రాలు కూడా రిలీజ్‌ కానున్నాయి. కాగా జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం రోజు రవితేజ బర్త్‌డే సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల  చేసిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ ఎప్పటిలాగే మాస్‌ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. చేతులో రాడ్‌ పట్టుకొని తనదైన శైలీలో నడుస్తూ నయా లుక్‌లో అదరగొట్టాడు. ఎటువంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement