![Khiladi Director Ramesh Varma Wife Rekha Varma Shocking Comments On Ravi Teja - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/12/ravi-teja.jpg.webp?itok=uQrE4RCv)
Khiladi Director Ramesh Varma Wife Shocking Comments On Ravi Teja: ‘మాస్ మహారాజా’ రవితేజపై ‘ఖిలాడి’ డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజను ఉద్దేశిస్తూ ఆమె చీప్ యాక్టర్ అంటూ ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల ‘ఖిలాడి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ, రమేష్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవి కాస్తా సటైరికల్‌గా ఉన్నప్పటికి రమేష్ వర్మ వాటిని పెద్దగ పట్టించుకోలేదు. అంతేకాదు అంతా బాగానే ఉన్నట్లు ఇద్దరూ వ్యవహరించారు. అయినప్పటికీ రవితేజ వ్యాఖ్యలు చూస్తుంటే వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు అనుమానాలు తలెత్తాయి.
చదవండి: ఆ సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలో ఆయన భార్య చేసిన ఇన్‌స్టా స్టోరీ పోస్టులు ఈ అనుమానాలకు మరింత బలకం చేకూరేలా కనిపిస్తున్నాయి. ఇంతకి అసలేం జరిగిందంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ, డైరెక్టర్‌పై కాస్తా అసహనం చూపించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. నిర్మాత సత్యన్నారాయణను ఉద్దేశించి ఖిలాడీ సినిమాకు సంబంధించి మీరే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్‌గా వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ఇక రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్‌గా చెప్పేశాడు.
చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ
ఇలా ఇద్దరి మధ్య చిన్న పాటి యుద్ధం నడుస్తుండగా రమేశ్ వర్మ భార్య చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి. ఆమె తన స్టోరీలో ‘గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది’ అంటూ రేఖవర్మ పోస్ట్ పెట్టారు. దీంతో రవితేజ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. అసలు రవితేజకు, రమేష్ వర్మకు మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశ కాగా.. ఈ వివాదంలోకి రమేష్ వర్మ రేఖ రావడం మరింత హాట్‌టాపిక్ మారింది. మరి ఇది ఎంతవరకు వెళుతుంది, ఆమె వ్యాఖ్యలపై రవితేజ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తిగా మారింది. కాగా రవితేజ, రమేశ్ వర్మలు కాంబినేషన్‌లో గతంలో వీరా మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఖిలాడీ మూవీ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment