రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసిందని తెలిసింది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో అర్జున్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం మే 28న విడుదల కానుంది.
‘క్రాక్’తో కిరాక్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ఫైనల్ చేశాడు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
చదవండి: మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం
Comments
Please login to add a commentAdd a comment