సూపర్‌ హిట్ రీమేక్‌లో బెల్లంకొండ | Bellamkonda Sai Sreenivaas In Ratsasan Remake | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్ రీమేక్‌లో బెల్లంకొండ

Published Wed, Feb 13 2019 10:50 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda Sai Sreenivaas In Ratsasan Remake - Sakshi

మీడియం రేంజ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ, ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ కు కూడా బెల్లంకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల కోలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన థ్రిల్లర్‌ మూవీ రాక్షసన్‌. విష్ణు విశాల్‌, అమలాపాల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఈ సినిమాకు రైడ్‌, వీర చిత్రాల ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement