‘క్రాక్’ హిట్ మాస్ మహారాజా రవితేజలో జోష్‌ని నింపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇదే జోష్ లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
(చదవండి : బర్త్‌డే స్పెషల్: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు)
రవితేజ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో రవితేజ ఎప్పటిలాగే మాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. చేతులో రాడ్ పట్టుకొని తనదైన శైలీలో నడుస్తూ నయా లుక్‌లో అదరగొట్టాడు. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment