Ravi Teja Khiladi Movie Release Date: థియేటర్స్‌లోనే మాస్‌ మహరాజా ‘’ఖిలాడి‘’ - Sakshi
Sakshi News home page

థియేటర్స్‌లోనే మాస్‌ మహరాజా ‘’ఖిలాడి‘’

Published Sun, May 16 2021 3:50 PM | Last Updated on Sun, May 16 2021 8:19 PM

Raviteja New Movie Khiladi To Release Only On In Theatres - Sakshi

క్రాక్  మూవీతో  సూపర్‌ హిట్ కొట్టిన మాస్ మహరాజా రవితేజ  ప్రస్తుతం ఖిలాడి ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. యాక్షన్ కింగ్ అర్జుతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు .షెడ్యూల్‌  ప్రకారం ఈ నెల 28 న విడుదల కు సిద్దం చేశారు .ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ' ఖిలాడి ' సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుండగా , ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పష్టతనిచ్చారు .

రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు . ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు . కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు . కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు .

(చదవండి:టైసన్‌, అది నువ్వేనా? షాక్‌లో ఫ్యాన్స్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement