రమేష్‌వర్మ దర్శకత్వంలో వస్తా నీ వెనక | Haveesh plays lead roll in 'Vastha Nee Venaka' | Sakshi
Sakshi News home page

రమేష్‌వర్మ దర్శకత్వంలో వస్తా నీ వెనక

Published Thu, Nov 28 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

రమేష్‌వర్మ దర్శకత్వంలో వస్తా నీ వెనక

రమేష్‌వర్మ దర్శకత్వంలో వస్తా నీ వెనక

‘నచ్చితే’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుని, ‘జీనియస్’లో భిన్న కోణాలున్న పాత్ర చేసి తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు హవీష్. ఈ చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్‌కుమార్ తాజాగా హవీష్‌తో మరో సినిమా నిర్మించబోతున్నారు. రమేష్‌వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్, కిరణ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం వచ్చే నెల 11న జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘విభిన్నంగా సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రం ఇది.
 
  ఇప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి కథతో సినిమా రాలేదు. హీరోగా హవీష్ స్థాయిని పెంచే విధంగా ఉంటుంది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ మాత్రమే కాదు.. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఈ అందమైన ప్రేమకథలో సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంది. ఇందులో ఇద్దరు నాయికలుంటారు. వారి ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రా నికి మాటలు: హర్షవర్ధన్, రచన: విసు, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement