
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు.. ‘అల్లుడు శీను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్‌ను కొట్టలేకపోతున్నాడు. అన్ని సినిమాలను హై బడ్జెట్‌తో తెరకెక్కించినా, స్టార్ హీరోయిన్‌లతో జతకట్టినా అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.
ఇటీవలె ‘సాక్ష్యం’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో.. డైరెక్టర్ తేజతో కలిసి సినిమాను చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశాడు. ఇది పూర్తిస్థాయి ప్రేమ కథాచిత్రమని సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మించబోతోన్న ఈ చిత్రానికి రమేష్‌వర్మ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment