బ్రహ్మీ హీరోగా వర్మ సినిమా | Ramesh Varma Movie with Brahmi as Hero | Sakshi
Sakshi News home page

బ్రహ్మీ హీరోగా వర్మ సినిమా

Published Wed, Oct 26 2016 1:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

బ్రహ్మీ హీరోగా వర్మ సినిమా

బ్రహ్మీ హీరోగా వర్మ సినిమా

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వారందరూ అడపాదడపా హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. బ్లాక్ వైట్ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతీ కామెడీ నటుడు ఇదే బాటలో నడుస్తున్నారు. అయితే కొంత మంది హీరోలుగానే కొనసాగే ప్రయత్నం చేసి విఫలమవ్వగా మరికొందరు తిరిగి కామెడీ జానర్లో కంటిన్యూ అయిపోయారు.

అదే బాటలో సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం హీరోగా నటించినా.. తనకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన కామెడీ క్యారెక్టర్లను మాత్రం పక్కన పెట్టేయలేదు. అప్పట్లో బాబాయ్ హోటల్ లాంటి సినిమాతో తనకు నవ్వించటమే కాదు ఏడిపించటం కూడా తెలుసని ప్రూవ్ చేసుకున్నాడు బ్రహ్మీ. ఆ తరువాత కూడా ఒకటి రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినా.. కమెడియన్గానే కొనసాగుతున్నాడు.

తాజాగా మరోసారి హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు బ్రహ్మానందం. ఒక ఊరిలో, వీర, రైడ్ లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో బ్రహ్మనందం హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో బ్రహ్మనందం లీడ్ రోల్లో తెరకెక్కిన్న జఫ్ఫా సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన రమేష్ వర్మ ఈసారి తన దర్శకత్వంలో బ్రహ్మీ హీరోగా సినిమా చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement