
‘కవచం’ సినిమాతో రీసెంట్‌గా పలకరించిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. చిత్ర ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా మరో చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు.
తమిళ హిట్ మూవీ రాక్షసన్‌ను తెలుగులో రాక్షసుడుగా బెల్లంకొండ హీరో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సైకో థ్రిల్లర్‌నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో వీర, రైడ్ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘సీత’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ‘సీత’ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
Here comes the first look poster of #Rakshasudu an interesting and unique psycho thriller on the way !!@anupamahere #kaushik#RakshasuduFirstLook#HappyUgadi #eid2019 release 😃 pic.twitter.com/H3HG6jMSWr
— Sai bellamkonda (@BSaiSreenivas) April 6, 2019
Comments
Please login to add a commentAdd a comment