ఈ ‘రాక్షసుడు’ చాలా విభిన్నం : సూర్య | Surya's Rakshasudu first look launched | Sakshi
Sakshi News home page

ఈ ‘రాక్షసుడు’ చాలా విభిన్నం : సూర్య

Published Sun, May 10 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

ఈ ‘రాక్షసుడు’ చాలా విభిన్నం : సూర్య

ఈ ‘రాక్షసుడు’ చాలా విభిన్నం : సూర్య

‘‘ముందు ఓ ప్రేమకథ చేయాలనుకున్నాం. కానీ, కొన్ని వైవిధ్యమైన అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఓ డిఫరెంట్ జానర్‌లో ఈ సినిమా ఉంటుంది’’ అని  సూర్య అన్నారు. ఆయన హీరోగా స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో వెంకట్ ప్రభు తమిళంలో నిర్మించిన ‘మాస్’ చిత్రం ‘రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార, ప్రణీత కథానాయికలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ -‘‘రవితేజ-సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందించాలనుకున్నాం కానీ, కుదర్లేదు.
 
  ఇప్పుడు సూర్యతో చేసిన ఈ సినిమా చాలా కొత్త జానర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది’’ అన్నారు. ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత వెన్నెలకంటి, ఛాయాగ్రాహకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement