శ్రీకృష్ణుడి చేతిలో హతమైన రాక్షసుల గురించి తెలుసా? | Lord Shri krishna Janmashtami do you the know demons killed by krishna | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడి చేతిలో హతమైన రాక్షసుల గురించి తెలుసా?

Published Mon, Aug 26 2024 4:11 PM | Last Updated on Mon, Aug 26 2024 4:33 PM

Lord Shri krishna Janmashtami do you the know demons killed by krishna

ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవకీ వసుదేవులకు అష్టమ(8వ) సంతానంగా జన్మించిన వాడే  శ్రీకృష్ణుడు.  అలాగే మహావిష్టువు ఎనిమిదో అవతారంగా కృష్ణావతారమని, ఇది చాలా విశిష్టమైందని  భక్తుల విశ్వాసం.కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపు కుంటారు. అయితే కృష్ణావతారంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణార్థంఅనేకమందిరాక్షసులను తుదముట్టించాడు.  ఆ  వివరాలు ఒకసారి చూద్దామా.

 పూతన: మాయారూపంలో చిన్ని కృష్ణుడికి చనుపాలిచ్చి చంపాలని  చూసిన రాక్షసి. ఇది గమనించిన కృష్ణుడి రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా  హరించాడు.

శకటాసురుడు,తృణావర్త  (సుడిగాలి): కంసుడు అనుచరులైన వీరుకృష్ణుడిని వధించాలని, అపహరించాలని భావించి ఆయనచేతిలోనే  ప్రాణాలు కోల్పోయి, విముక్తి పొందిన రాక్షసులు

వత్సాసుర వధ: రేపల్లెనెంచి బృందావనానికి చేరిన  కృష్ణుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోడె గిత్త రూపంలో వచ్చాడు వత్సాసురుడు. దీన్ని పసిగట్టిన కృష్ణయ్య  దాన్ని ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి  కొట్టి చంపాడు
బకాసురవధ: కంసుడు కృష్ణుడిని చంపడానికి పూతన సోదరుడు బకాసురుడు. పక్షిరూపంలో ఉన్న అతడిని కృష్ణుడు వధించాడు.

శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుకుటుండుగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు పెద్ద కొండచిలువ రూపంలో వచ్చి శ్రీకృష్ణుడిచేతిలో హతమయ్యాడు. 

అలాగే అరిష్టాసుర,  ఇంకా  గోవుల సమాజానికి ఒక పీడకలగా మారిన కాళియ మర్ధనంచేసి అక్కడి ప్రజలకు విముక్తి కల్పించాడు.  

కువలయపీడ- శ్రీ కృష్ణుడు మధురలో మదగజం రూపంలో ఉన్న ఏనుగు రాక్షసుడిని శ్రీ కృష్ణుడు చంపాడు.
కంసుడు పంపించిన మరో రాక్షసుడు అశ్వం రూపంలో ఉన్న కేశికను కూడా వధించాడు కృష్ణుడు. 

పౌండ్రక వాసుదేవుడి వధ : అసూయతో యుద్ధం ప్రకటించి, శ్రీకృష్ణుడు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కానీ వైరభక్తితో కృష్ణుని లో కలిసిపోయాడు.

శిశుపాలుడి వధ: శిశుపాలుడు తల్లి సాత్యతికిచ్చిన మాట ప్రకారం అతని నూరు తప్పులను కాచిన శ్రీకృష్ణుడు,అతని దూషణలు శృతి మించడంతో సుద‌ర్శన చ‌క్రాన్ని ఉపయోగించి శిశుపాలుడుని హత మార్చాడు. 

కంస చాణూర మర్ధన: తండ్రిశాపంతో అసురులుగా పుట్టిన  చాణూరుడు, ముష్టికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు , కంసుని కొలువులో చేరి, చివరికి నల్లనయ్య చేతిలో శాప విముక్తి పొందారు. ఇంకా వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు కూడా నల్లనయ్య చేతిలో హతమయ్యాడు.  

అనుచరుల మరణంతో, యుద్ధానికి కాలుదువ్విన  మామ కంసుడిని అతి సునాయాసంగా కడతేర్చాడు కన్నయ్య. భౌమాసుర (నరకాసుర)- నరకాసురుడు శ్రీకృష్ణుని 16వేల భార్యలను బంధించాడు, చివరికి కృష్ణుడి చేతిలో చనిపోయాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement