ప్రముఖ నిర్మాత డిల్లీ బాబు మృతి | Tamil Producer Dilli Babu Passed Away | Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాత డిల్లీ బాబు మృతి

Published Mon, Sep 9 2024 10:01 AM | Last Updated on Mon, Sep 9 2024 10:21 AM

Tamil Producer Dilli Babu Passed Away

కోలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది.  ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లో అనేక  విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. 

ఢిల్లీ బాబు కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం ఈ తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్ 9న జరుగుతాయని ప్రకటించారు. అస్వస్థతకు గురైన ఢిల్లీ బాబు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సమాచారం. ఆయన ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పవచ్చు.

యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై తమిళంలో  రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్‌తో పాటు డబ్‌ కూడా అయ్యాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి, రాక్షసన్ (రాక్షసుడు) వంటి చిత్రాలు తెలుగువారిని బాగా మెప్పించాయి. ముఖ్యంగా ఆయన కొత్తవారితో సినిమాలు తెరకెక్కిస్తారు. అందువల్ల చిత్రపరిశ్రమలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement