
డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. లేటెస్ట్‌గా తమిళ చిత్రం ‘రాక్షసన్’ తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’లో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్నారు. ‘‘ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ రచయితగా పరిచయం అవుతున్నారు. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈద్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత హవీష్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి. దిలీప్, సంగీతం: జిబ్రాన్.
Comments
Please login to add a commentAdd a comment