‘రాక్షసుడు’ కోసం వేట! | Bellamkonda Sai Sreenivas Rakshasudu Movie teaser | Sakshi
Sakshi News home page

‘రాక్షసుడు’ కోసం వేట!

Published Sat, Jun 1 2019 10:44 AM | Last Updated on Sat, Jun 1 2019 10:44 AM

Bellamkonda Sai Sreenivas Rakshasudu Movie teaser - Sakshi

కోలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన థ్రిల్లర్‌ మూవీ రాక్షసన్‌. విష్ణు విశాల్‌, అమలాపాల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాక్షసుడు పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రీయూనిట్‌.

జూలై 18న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదలైంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గిబ్రాన్‌ సంగీతమందిస్తున్నాడు. హవీష్ పిక్చర్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement