అనుపమా పరమేశ్వరన్, సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘రైడ్, వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ. హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హవీష్ కోనేరు మాట్లాడుతూ–‘‘తమిళంలో హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రాన్ని ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశాం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్.
Comments
Please login to add a commentAdd a comment