బర్త్‌డే స్పెషల్‌ | Ravi Teja is Rakshasudu movie shooting launch from march | Sakshi
Sakshi News home page

బర్త్‌డే స్పెషల్‌

Published Sun, Jan 26 2020 2:43 AM | Last Updated on Sun, Jan 26 2020 2:43 AM

Ravi Teja is Rakshasudu movie shooting launch from march - Sakshi

రవితేజ పుట్టినరోజు నేడు. ఈ స్పెషల్‌గా ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ప్రకటన వెల్లడైంది. ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో హిట్‌ సాధించిన రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఏ స్టూడియోస్‌ పతాకంపై హవీష్‌ ప్రొడక్షన్‌లో కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శ కత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement