
బెల్లంకొండ సాయి శ్రీనివాస్
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని.. చూడకుంటే నాకు వెన్నెలేది...’ పాట వినగానే చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ సినిమా గుర్తుకురాకమానదు. రాధ, సుహాసిని హీరోయిన్లుగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా 1986లో విడుదలై మంచి విజయం అందుకుంది.
ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘రైడ్, వీర’ చిత్రాల ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాచ్చసన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్‌లో ఏ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్.
Comments
Please login to add a commentAdd a comment