రామ్‌చరణ్‌ సినిమాకి బై బై? | Samantha walks out from Ram Charan | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ సినిమాకి బై బై?

Published Sun, Mar 5 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

రామ్‌చరణ్‌ సినిమాకి బై బై?

రామ్‌చరణ్‌ సినిమాకి బై బై?

ఇప్పటివరకూ రామ్‌చరణ్‌ సరసన సమంత నటించలేదు. ఈ ఇద్దరి కాంబినే షన్‌ అంటే కాస్త ఆసక్తిగానే ఉంటుంది. అందుకే సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా రూపొందనున్న సినిమాలో సమంతను నాయికగా తీసుకున్నారని వినగానే ‘ఫ్రెష్‌ పెయిర్‌’ అని చాలామంది అనుకున్నారు.

అయితే ఈ ఫ్రెష్‌ జోడీ తెరపై కనిపించే ఛాన్స్‌ లేదని ఫిలింనగర్‌ అంటోంది. ఈ చిత్రం నుంచి సమంత తప్పుకున్నారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఒకవేళ అదే నిజమైతే కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ముందు అనుపమా పరమేశ్వరన్‌ని నాయికగా తీసుకుని, ఆ తర్వాత ఆమెను వద్దనుకున్నారు. ఇప్పుడు సమంత తప్పుకున్నారని వార్త వచ్చింది. మరి.. ఈ ప్లేస్‌ని ఎవరు రీప్లేస్‌ చేస్తారో? లేక సీన్లో సమంతే ఉంటారో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement