
దక్షిణాది అగ్రకథనాయికగా ఇప్పటికీ చెలమణి అవుతున్న మళయాళి కుట్టి నయనతార. ఆమె తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథనాయకుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజీ స్టార్‌గా వెలుగొందుతోంది. అందంలోనూ, అభినయంలోనూ తనకు తానే సాటి అని పేరుతెచ్చుకుంది. ఆమె డైరెక్టర్ విఘ్నేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పైగా ఇద్దరు పిల్లలు(సరోగసి విధానం) తల్లి కూడా. నాలుగు పదుల వయసుకు దగ్గరవ్వుతున్న ఏమాత్రం వన్నెతరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇప్పటికీ అందంగా ఉండటం వెనుక దాగున్న రహస్యం ఏంటీ?..ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడూ చూద్దాం.
ఆమె ఎక్కువగా ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ప్రిఫర్ చేస్తుందట. బాడీ డ్రీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువగా మచినీళ్లు తాగుతుందట. అలాగే బయటకు వెళ్లితే కంప్లసరి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట. అస్సలు అది లేకుండా గడప కూడా దాటనని చెబుతున్నారు నయన్. అంతేకాదు మాయిశ్చరైజర్‌ని తప్పనిసరిగా వాడతారు. అది ఆమె చర్మాన్ని అందంగా మృదువుగా ఉండేలా చేస్తుంది. ఆమె ఎప్పుడూ విటమిన్ సీ ఎక్కువగా ఉండే.. పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుందని చెబుతోంది నయన తార.
(చదవండి: కీర్తీ సురేష్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment