నటిని టచ్‌ చేద్దామని ఆమె గదిలో మూడు రోజులు.. | Pamela Anderson stalker hid in her house | Sakshi
Sakshi News home page

నటిని టచ్‌ చేద్దామని ఆమె గదిలో మూడు రోజులు..

Published Fri, Mar 2 2018 5:03 PM | Last Updated on Fri, Mar 2 2018 5:03 PM

Pamela Anderson stalker hid in her house - Sakshi

పమీలా ఆండర్సన్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూయార్క్‌ : ఇప్పటి వరకు పురుషులు స్త్రీలను వేధించడం చూశాం. అయితే, ఓ మహిళ కూడా మరో మహిళను లైంగికంగా వేధిస్తుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అనుభవం కూడా ఓ ప్రముఖ హాలీవుడ్‌ నటి ఎదుర్కోవాల్సి వచ్చింది. పమీలా ఆండర్సన్‌ ప్రముఖ కెనడియన్‌ అమెరికన్‌ నటి పైగా మోడల్‌. ఆమెకు ఓ అతిథి బస గృహం ఉంది. 2001లో ఒకసారి వైద్యం చేయించుకునేందుకు ఆమె తల్లిదండ్రులు వస్తున్నందున వారికోసం ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లింది. అయితే, తన పడక గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా అందులో ఓ మహిళ తనకు ఇష్టమైన, తాను ధరించే  బే వాచ్‌ స్విమ్‌ సూట్‌ను ధరించి కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

అయితే, తనను చూసి భయపడవొద్దని, తాను అల్లరి చేసేందుకు రాలేదని, తాను కేవలం ఆమెను స్పృషించేందుకే వచ్చానంటూ చెప్పింది. టచ్‌ చేసేందుకు వచ్చినంత మాత్రానా తనను లెస్బియన్‌ అనుకోవద్దని చెప్పింది. దాంతో ఒక్కసారిగా పమీలాకు చెమటలు పట్టాయి. 'నిన్ను ఓసారి టచ్‌ చేసి వెళ్లేందుకే నేను ఈ ఇంట్లోకి రహస్యంగా చొరబడ్డాను. మీరు ఒక్కరోజైనా రాకపోతారా అని మీరు ధరించే స్విమ్‌ సూట్‌ను వేసుకొని మూడు రోజులుగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను' అని ఆమె చెప్పింది. దాంతో అప్పటికే తన ఇద్దరు బిడ్డలతో వచ్చిన పమీలా ఆ కొత్త మహిళ బహుశా ఓ సైకో ఉంటుందని భయపడి తన సెక్యూరిటీని అలర్ట్‌ చేసింది. దాంతో వారు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసుల విచారణలో కూడా పమీలాకు హానీ చేయడానికి వచ్చినట్లు రుజువు కాలేదు. కేవలం వెర్రి అభిమానంతోనే ఆమె ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ సంఘటన మాత్రం తనను భయపెట్టిందని, ఇప్పటికీ గుర్తొస్తే భయపడుతుంటానని ఓ మీడియాకు ఓ లేఖ ద్వారా ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement