జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ | Anchor Suma Kanakala Reveals About Her Skin Disease | Sakshi
Sakshi News home page

Suma Kanakala: చాలా ఏళ్ల నుంచి దాచిపెట్టాను..అన్నీ చేసి చూశాను..కానీ..

Oct 9 2021 12:57 PM | Updated on Oct 9 2021 3:10 PM

Anchor Suma Kanakala Reveals About Her Skin Disease - Sakshi

Anchor Suma : చాలా ఏళ్లుగా ఒక విషయం దాచిపెట్టాను. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇక బయటపెట్టాలనుకుంటున్నా అంటూ సుమ..

Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్‌ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో త‌న‌కు ఎవ‌రూ సాటి లేర‌న్న విధంగా ముందుకు సాగుతుంది.   ఆడియో ఫంక్ష‌న్‌, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో'

'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్‌ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్‌ వైరల్‌

గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్‌ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్‌ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్‌ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement