Skin disease
-
లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు వ్యాక్సిన్
కొవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలోని బయోవెట్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ) కోసం వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. పాడి పశువుల చర్మంపై వచ్చే లంపీ స్కీన్ వ్యాధికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధి నివారణకు ‘బయోలంపీవాక్సిన్’కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆమోదం లభించినట్లు సంస్థ పేర్కొంది.బయోలంపీవాక్సిన్బయోలంపీవాక్సిన్ అనేది పాడి పశువులను ఎల్ఎస్డీ నుంచి రక్షించడానికి తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న జంతువులకు ఏటా ఒకసారి దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. బయోవెట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పరస్పర సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)ల్లో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: Aero India 2025 బీఈఎల్ కొత్త ఉత్పత్తులుఈ వ్యాక్సిన్ తయారు ప్రాజెక్ట్‌కు ఎన్ఆర్సీఈ శాస్ట్రవేత్తలు నవీన్ కుమార్, బీఎన్ త్రిపాఠి నేతృత్వం వహించారు. ఎల్ఎస్డీ వల్ల దేశంలో పాడి ఉత్పాదకత గణనీయంగా ప్రభావం చెందుతోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా పాడి పశువులు ఈ వ్యాధి బారినపడి మరణించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాధివల్ల 2022 సంవత్సరంలో రూ.18,337.76 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి 26% క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్‌ఫాక్స్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్‌తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
‘విటిలిగో’ వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్‌దాస్..లక్షణాలు ఇవే!
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు.. తెరవెనుక ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి ఆర్థిక, మానసిక సమస్యలు అయితే మరికొందరికి అనారోగ్య ఇబ్బందులు. అయినా కూడా వినోదాన్ని అందించడంలో మాత్రం వారు వెనుకడుగు వేయడం లేదు. అరుదైన రోగాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన.. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకున్న మమతా మోహన్‌దాస్.. తాజాగా మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారు. తాను ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటో చూద్దాం. ‘విటిలిగో’ ఎందుకు వస్తుంది? చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని ఈ వ్యాధి వస్తుంది. బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. రంగు కాస్త తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి సోకే అవకాశం ఉంది. మానసిక కుంగుబాటు, రసాయన ప్రభావాలకు గురి కావడం, ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ కావడం వల్ల కూడా బొల్లి వ్యాధి రావొచ్చు. ఇది ప్రమాదమేమీ కాదు. ప్రాణాపాయం కూడా కాదు. లక్షణాలు ఏంటి? ఈ వ్యాధి సోకిన వారి చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ తెల్లని పాచెస్ కనిపిస్తాయి. తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడుతుంది. నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారుతంది. చికిత్స ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. కానీ బొల్లి వ్యాప్తిని ఆపడానికి మాత్రం చికిత్స ఉంది. బొల్లి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తెల్లని మచ్చలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే చికిత్స అందించాలి. యూవీ థెరపీ, స్టెరాయిడ్ క్రీమ్స్, ఫోటో కీమో థెరపీ ద్వారా తెల్లటి మచ్చలను తగ్గించొచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే శాశ్వత నివారణ సాధ్యం కాకపోవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్య నిపుణులు, పలు అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే సరైన నిర్ణయం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్.. ఎందుకంటే?
జహీరాబాద్: పశువులకు వ్యాపిస్తున్న ముద్ద చర్మపు వ్యాధి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందు జ్రాగత్తగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి శివారులో రాష్ట్ర సరిహద్దు వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కలెక్టర్ శరత్ ఉత్తర్వులతో పోలీస్, పశు సంవర్థక, రవాణా శాఖల అధికారులు చెక్‌పోస్టు వద్ద సంయుక్తంగా పశువుల తనిఖీ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పశువులతో వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. వ్యాధి లేనట్లు నిర్ధారణకు వచ్చాకే పశువులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆదివారం గేదెలు, మేకలతో ఉన్న వాహనాలు 15 వచ్చాయని, వ్యాధులు ఉన్న పశువులు ఏవీ రాలేదని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం) -
వింత సమస్య.. ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం!
లండన్: విహారయాత్రకు వెళ్లి ఎండలో నిద్రలోకి జారుకున్న ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది. బ్రిటన్‌కు చెందిన బ్యూటీషియన్ సిరిన్ మురాద్ (25) అనే యువతి కొద్ది రోజుల క్రితం బల్గేరియాకు విహారయాత్రకు వెళ్లింది. ఓ పూల్ వద్ద కూర్చొని అక్కడే కాసేపు కునుకుతీసింది. 30నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు, చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ.. పట్టించుకోలేదు. ఎండకు పొడిబారినట్లుందని మళ్లీ నిద్రపోయింది. అయితే మరుసటి రోజు నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా తయారైంది. ఎండలో నిద్రపోవడమే దీనికి కారణమని భావించింది.. పైగా సన్‌స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోలేదని పేర్కొంది. తాను నిద్రపోయిన ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 21డిగ్రీలు ఉన్నట్లు తెలిపింది. నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా కనిపిస్తున్నా.. ఏం జరగదులే అని భావించి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు సిరిన్ మురాద్. రోజులకు ఆమె ముఖం మొత్తం పగుళ్లు తేలినట్లు మారింది. అయితే.. ప్రస్తుతం కోలుకున్నానని, కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయాయని ఫేస్బుక్లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది సిరిన్. మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తాను ఎదుర్కొన్న వింత, భయానక అనుభవాన్ని వివరిస్తూ.. ఆ యువతి ప్రస్తుతం సన్‌స్క్రీన్ లోషన్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తోంది. వైద్య నిపుణులు మాత్రం ఆమె చర్మం అలా కావడానికి వేరే కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎండలో వెళితే అందరికి అలా జరగదని, క్యాన్సర్ ఉన్నవారు ఆ తరహా సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా? -
లంపీ చర్మ వ్యాధి..: సంప్రదాయ చికిత్స
పశువుల చర్మంపై గడ్డల మారిదిగా వచ్చే ప్రాణాంతక వ్యాధి పేరు లంపీ చర్మ వ్యాధి. ఈ వ్యాధి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గో సంతతికి సోకింది. గత నెలలో గుజరాత్లో 5 జిల్లాల్లో 1,229 పశువులకు సోకింది. 39 పశువులు ప్రాణాలుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రైతులకు ఇంటిపట్టున దొరికే సంప్రదాయ దినుసులతో కూడిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను రైతులకు అందుబాలోకి తెచ్చింది. లంపీ చర్మ వ్యాధి చికిత్సకు 2 పద్ధతులున్నాయి. 1) తినిపించే మందు: లంపీ చర్మ వ్యాధి చికిత్స కోసం సంప్రదాయ దినుసులతో నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసే పద్ధతులు రెండు ఉన్నాయి. మొదటి విధానం: ఈ చికిత్సలో ఒక మోతాదుకు అవసరమయ్యే పదార్థాలు: తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. తయారు చేసిన పేస్ట్‌కు తగినంత బెల్లం కలిపి పశువుకు తినిపించాలి. మొదటి రోజున ఇలా తాజాగా తయారు చేసిన ఒక మోతాదు మందును ప్రతి 3 గంటలకోసారి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి.. రెండు వారాల పాటు.. రోజుకు మూడు సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తాజాగా తయారు చేసిన మందును తినిపించాలి. రెండవ విధానం: లంపీ చర్మ వ్యాధికి సంప్రదాయ పద్ధతిలో మందును రెండు మోతాదులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెల్లుల్లి 2 పాయలు, ధనియాలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, తులసి ఆకులు గుప్పెడు, బిరియానీ ఆకులు పది గ్రాములు, మిరియాలు పది గ్రాములు, తమలపాకులు 5, ఉల్లిపాయలు చిన్నవి రెండు, పసుపు పది గ్రామలు, నేలవేము ఆకుల పొడి 30 గ్రాములు, కృష్ణ తులసి ఆకులు గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నేరేడు ఆకులు ఒక గుప్పెడు.. ఇంకా బెల్లం వంద గ్రాములు. ఈ మందును కూడా ప్రతి సారీ తాజాగా తయారు చేయాలి. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి, దానిలో బెల్లం కలపాలి. మొదటి రోజు ప్రతి 3 గంటల కోసారి తాజా మందు తయారు చేసి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి ప్రతిరోజూ మందును తాజాగా తయారు చేసి రోజుకు రెండుసార్లు చొప్పున పొద్దున్న, సాయంత్రం పశువు స్థితి మెరుగుపడే వరకు తినిపించాలి. 2) గాయంపై రాసే మందు: లంపీ చర్మం జబ్బు సోకిన పశువు చర్మంపై గాయం ఉంటే గనక, అందుకోసం ప్రత్యేకంగా సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేసి పై పూతగా పూయాలి. కావలసిన సామగ్రి: కుప్పింటాకులు 1 గుప్పెడు, వెల్లుల్లి పది రెబ్బలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి లేదా నువ్వుల నూనె 500 మిల్లీ లీటర్లు. పసుపు 20 గ్రాములు, గోరింటాకు ఒక గుప్పెడు, తులసి ఆకులు ఒక గుప్పెడు. తయారు చేసే విధానం.. అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేయాలి. దానిలో 500 మిల్లీ లీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె కలిపి మరిగించి, తర్వాత చల్లార్చాలి. రాసే పద్ధతి: గాయాన్ని శుభ్రపరచి దాని మీద ఈ మందును రాయాలి. గాయం మీద పురుగులు గనక ఉన్నట్లయితే.. సీతాఫలం ఆకుల పేస్ట్ లేదా కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయాలి. National Dairy Development Board యూట్యూబు ఛానల్లో లంపీ చర్మ వ్యాధికి చికిత్సపై తెలుగు వీడియో అందుబాటులో ఉంది.. ఇలా వెతకండి.. Ethno-veterinary formulation for Lumpy Skin Disease-Telugu. -
అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
విక్కీ డౌనార్, సనమ్ రే, బద్లా పూర్, కాబిల్, ఉరి, గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి చిత్రాలతో బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బీటౌన్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్. ఇటీవల తన వ్యక్తిగత విషయం గురించి వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా వేదికగా తాను ఎదుర్కొన్న చర్మ సమస్యపై పోస్ట్ పెట్టింది. యామీ తన యుక్త వయసు నుంచి 'కెరాటోసిస్ పిలారిస్' అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది. ఇటీవల ఎలాంటి ఎడిట్ చేయని తన ఫొటోలను పోస్ట్ చేసి ఎమోషనల్‌గా క్యాప్షన్ రాసుకొచ్చింది యామీ గౌతమ్. 'నేను చాలా ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఏర్పరుచుకున్నా భయం, అభద్రతా భావాలను వీడాలని చివరిగా ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నా లోపాలను (చర్మ సమస్య) హృదయపూర్వకంగా అంగీకరించే ధైర్యం నాకు వచ్చింది. ఈ నిజాన్ని మీతో పంచుకునే ధైర్యం వచ్చింది. ఎరుపు రంగులో ఉండే నా హెయిర్‌కు రంగు వేయడం, కంటి కింద చారలను స్మూత్నింగ్ చేయాలని నాకు అనిపించట్లేదు. అయినా నేను అందంగానే ఉన్నా.' అని షేర్ చేసింది యామీ. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత దానికి వచ్చిన స్పందన గురించి ఇలా చెప్పుకొచ్చింది యామీ గౌతమ్. ఈ పోస్ట్‌లో 'పోస్ట్ రాయడం కష్టం కాదు. అది విముక్తి కలిగిస్తుంది. నా పరిస్థితి గురించి తెలుసుకున్నప్పటి నుంచి నేను పోస్ట్ పెట్టే వరకు నా ప్రయాణం సవాలుగా మారింది. ప్రజలు నన్ను షూట్లో చూసినప్పుడు ఎయిర్ బ్రష్ ఎలా చేయాలి, కనపడకుండా ఎలా దాచాలి అని మాట్లాడతారు. అది నన్ను చాలా ప్రభావితం చేసేది. ఆ నిజాన్ని అంగీకరించడానికి, నా విశ్వసాన్ని పెంపొందిచుకోవడానికి సంవత్సరాలు పట్టింది. ఈ పోస్ట్‌కు వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాను.' అని యామీ గౌతమ్ తెలిపింది. View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
సోరియాసిస్... కంటిపై దాని ప్రభావం!
చర్మం బాగా పొడిబారిపోయి దానిపైన ఉండే కణాలు పొట్టులా రాలిపోయే స్కిన్ డిసీజ్ అయిన సోరియాసిస్ గురించి తెలియని వారుండరు. మన సొంత వ్యాధినిరోధక వ్యవస్థ మన కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్)వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. అందరూ దాన్ని చర్మవ్యాధిగానే చూస్తారు. కానీ దాని దుష్ప్రభావాలు కంటిపైన కూడా కొంతవరకు ఉంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... ► కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు). ► కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్). ► కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి. ► కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు. జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్‌కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్‌ను అదుపులో పెడుతున్నారు. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్‌కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటివైద్యుడిని కూడా సంప్రదించడం అవసరం. -
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ
Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో' 'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ -
పశువులపైనా వైరస్ పడగ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజానీకంపై ఒకపక్క కరోనా వైరస్ పంజా విసురుతోంటే, మరోపక్క మూగజీవాలపై పాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ పడగ విప్పుతోంది. ఈ వైరస్‌తో సోకుతున్న ‘లంపీస్స్కిన్ వ్యాధి’కారణంగా ఆవులు, దూడల చర్మంపై బొడిపెలు వస్తున్నాయి. ఈ వైరస్ గతేడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసి, ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్టు పశువైద్య వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంతో పాటు ప్రస్తుతం కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆవులు, దూడల్లో దీన్ని గుర్తించామని, గేదెల్లో మాత్రం లక్షణాలు కనిపించలేదని అంటున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఈసారి కొంచెం ఎక్కువే ఉందని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగానే ఉందని, ఇప్పటికే దీని నివారణకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, పాడి రైతులు ఈ వైరస్‌ను గుర్తిస్తే ఆందోళన చెందకుండా తమను సంప్రదించాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) అమ్మతల్లి తరహాలో.. మనుషులకు అమ్మతల్లి (మశూచి) సోకినట్టే ఆవులకూ ఈ వైరస్ సోకుతుందని తెలుస్తోంది. ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధి కారణంగా పశువుల ఒంటి నిండా పెద్దపెద్ద బొడిపెలు వస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల మీదుగా అటవీ ప్రాంతాల నుంచి ఈ వైరస్ ఖమ్మం జిల్లాలోకి వచ్చిందని అధికారులు అంటున్నారు. వైరస్‌ను గుర్తించిన వెంటనే రింగ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక ఆవులో ఈ వైరస్ లక్షణాలు గుర్తిస్తే ఆ ఆవు ఉన్న గ్రామానికి 5 కిలోమీటర్ల చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 6వేలకు పైగా ఆవులకు ఈ వ్యాధి సోకగా 23 చనిపోయినట్టు సమాచారం. ఈ జిల్లాలోనే 17వేలకు పైగా ఆవులకు వ్యాక్సినేషన్ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ దీని ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని అధికారులు అంటున్నా రైతులు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. (ఒక్కరోజే 206 కేసులు..) ఆందోళన అవసరం లేదు వైరస్ పూర్తి నియంత్రణలో ఉంది. దీన్ని గుర్తించగానే మా శాఖ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో చేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు.– రాంచందర్, అడిషనల్ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ మనుషులకు సోకే అవకాశం లేదు.. పశువుల్లో కనిపిస్తున్న ఈ వైరస్ కారణంగా మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదని పశువైద్య వర్గాలు తెలిపాయి. ఈ వైరస్‌కి జూనోటిక్ లక్షణం లేదని, మనుషులకు ఎట్టి పరిస్థితుల్లో సోకే అవకాశం లేదని అంటున్నారు. ఈ వైరస్ సోకిన పశువులకు కూడా సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణహాని ఉండదని, మరణాల రేటు చాలా తక్కువని చెబుతున్నారు. గతంలో కూడా ఈ వైరస్ మన రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు ఉందని, అయితే ఇప్పుడు కొంత తీవ్రంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
అమ్మాయి ఒంటిమీద పులిపిర్లు... తగ్గేదెలా?
మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. ఆమెకు ముఖం మీదా, ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వతున్నాయి. పైగా అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆమె మేనిపై వాటిని చూస్తే మాకు ఆందోళనగా ఉంది. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి.– ఆర్. శైలజ, కర్నూలు మీరు చెప్పిన వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు... చర్మానికి చర్మం తగలడం వల్ల, వ్యాధి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి. బాబుకు తరచూ జలుబు... సలహా ఇవ్వండి మా బాబుకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, పానీయాలు ఇష్టంగా తాగుతాడు. వద్దన్నా మానడు. ఒక్కోసారి ఊపిరి సరిగ్గా ఆడటం లేదని అంటుంటాడు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటి ప్రభావం సరిగ్గా లేదు. బాబు ఆరోగ్య విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలో తెలియజేయండి.– ఎమ్.డి. అన్వర్‌బాషా, గుంటూరు మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్ అలర్జిక్ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్ అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారపర్యంగా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావరణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూల మొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్ వంటివి శరీరానికి సరిపడకపోవడంతో వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. పాపకు ఒంటిపై తరచూ దద్దుర్లు...! మా పాపకు ఆరేళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. ఒక రోజు ఉండి మళ్లీ తగ్గుతున్నాయి. ఈ సమస్యకు మందులు కూడా వాడాం. అయితే తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. పాప చాలా ఇబ్బంది పడుతోంది. ఇలా జరగడానికి కారణం ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి.– కనకరత్నం, నెల్లూరు మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు. ఇది అతి సాధారణ సమస్య. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండు రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ అర్టికేరియా అని చెప్పవచ్చు. ఆర్టికేరియాకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, వేరుసెనగపల్లీలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (అంటే బ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (అంటే లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం వల్ల; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల... మీరు చెబుతున్న అక్యూట్ అర్టికేరియా రావచ్చు. ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం. కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి, ఒత్తిడితో కూడిన, కంపనాలతో ఉండే పరిసరాల వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అక్యూట్ అర్టికేరియాకు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, ఏదైనా పురుగు కుట్టడం, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు, సీఫుడ్ వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. కాబట్టి మీ పాప విషయంలో చికిత్సలో భాగంగా మొదట పైన పేర్కొన్న అంశాలలో మీ పాప అర్టికేరియాకు ఏది కారణం కావచ్చో దాన్ని గుర్తించి, దాని నుంచి కొన్నాళ్లు మీ పాపను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇక లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మీ పాప విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌తో చర్చించి, తగిన చికిత్స తీసుకోండి.-డా. రమేశ్‌బాబు దాసరిసీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
చిట్టితల్లి.. పుట్టెడు కష్టం
అంతుచిక్కని జబ్బు ఆమెను మంచానికి పరిమితం చేసింది. చూస్తుండగానేఅది ప్రాణాంతకంగా మారింది. ప్రాణాలు దక్కాలంటే శస్త్రచికిత్సలే మార్గమంటూవైద్య నిపుణులు తేల్చి చెప్పారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తె ప్రాణాలు దక్కించుకునేందుకు నిరుపేద తండ్రి పడరాని పాట్లు పడుతున్నాడు.ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్సకు నోచుకోని అరుదైన జబ్బు బారి నుంచి తన బిడ్డను కాపాడాలంటూ అర్థిస్తున్నాడు. అనంతపురం : నల్లమాడ మండలంలోని పెమనకుంటపల్లికి చెందిన బైముతక లలితమ్మ, శేఖర్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని శేఖర్ పోషించుకుంటున్నాడు. కరువు నేపథ్యంలో పనులు సక్రమంగా లేక సంపాదన అరకొరగానే ఉంటోంది. రోజంతా శ్రమించిన వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జబ్బు మీద జబ్బు.. శేఖర్ దంపతుల పెద్ద కుమార్తె స్నేహలత పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి కష్టాలను దగ్గర నుంచి చూసిన ఆమె ఎలాగైనా ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ద్వారా తండ్రికి చేదోడుగా నిలవాలని భావించింది. అయితే విధి వక్రీకరించింది. మూడు నెలల క్రితం అంతు చిక్కని జబ్బు బారిన పడ్డ ఆమె... ఒకదాని తర్వాత మరో జబ్బుతో పూర్తిగా మంచానపడింది. ఏమి తిన్నా వాంతులే.. మూడు నెలల క్రితం స్నేహలత కుడిరొమ్ము పైభాగాన తొలుత చర్మం ఎర్రగా మారి, పుండులా మారింది. చీమూరక్తం బయటకు వస్తుండడంతో వైద్యులకు చూపించారు. చర్మసంబంధిత వ్యాధిగా నిర్ధారించి వైద్యులు చికిత్సలు చేస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స కోసం పుట్టపర్తి, కదిరి, బత్తలపల్లి, అనంతపురం తదితర ప్రాంతాల్లోని వైద్య శాలల చుట్టూ తిరిగాడు. తన సంపాదనలో కుమార్తెల చదువులు, పెళ్లిళ్లకంటూ పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ము మొత్తం ఖర్చు పెట్టాడు. అయినా నయం కాలేదు. తెలిసిన వారి వద్ద నుంచి అప్పులు చేసి మరీ బిడ్డకు నయం చేయించేందుకు ప్రయత్నించాడు. జబ్బు నయం కాలేదు కదా.. ఎడమ డొక్కలో గడ్డలా మరో సమస్య ఉత్పన్నమైంది. అప్పటి నుంచి హేమలత ఏమి తిన్నా.. విపరీతమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోతోంది. తాను తిన్న ఆహార పదార్థం పూర్తిగా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తోంది. నిద్రకు దూరమై... పాఠశాలలో మెరుగైన విద్యార్థుల్లో ఒక్కరుగా రాణిస్తున్న హేమలత.. తన జబ్బు కారణంగా చదువులకు దూరమైంది. మూడు నెలలుగా ఆమె పాఠశాల మెట్టు ఎక్కలేదు. తిన్న ఆహారం కూడా వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తుండడంతో పూర్తిగా నీరసించి పోయి, మంచానికే పరిమితమవుతూ వస్తోంది. ఛాతీ మీద, కడుపులోని పుండ్ల వల్ల భరించలేని నొప్పితో బాధపడుతోంది. చివరకు నొప్పి వల్ల ఆమె నిద్రకు సైతం దూరమైంది. తెల్లవార్లు బాధతో విలవిల్లాడుతున్న కుమార్తెను సముదాయించేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. శస్త్రచికిత్సకు రూ. 3 లక్షలు కుమార్తెకు చికిత్స చేయించేందుకు జిల్లాలోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ. లక్షకు పైగా శేఖర్ ఖర్చు పెట్టాడు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు. ఇటీవల హేమలత వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని వెంగళమ్మ చెరువు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అందించడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి కుమార్తె హేమలతను తీసుకెళ్లాడు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె రొమ్ము పైభాగాన ఉన్న గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉందని తేల్చి చెప్పారు. ఇందుకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు వస్తుందన్నారు. కడుపులోని పుండ్లకు మరో శస్త్రచికిత్స చేయడం ద్వారా తొలగించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు మరో రూ. లక్ష వరకు ఖర్చు వస్తుందని అంచనా వేశారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు భవన నిర్మాణ రంగంలో పనులు తగ్గాయి. రోజంతా శ్రమించినా వచ్చే అరకొర సంపాదనతో కుటుంబ పోషణే భారంగా మారింది. కూలీనాలి పనులు చేసుకుంటూ ఇప్పటికే కుమార్తె చికిత్స కోసం అప్పులు చేసి రూ. లక్షకు పైగా శేఖర్ ఖర్చు పెట్టుకున్నాడు. తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు చెప్పిన మేరకు శస్త్ర చికిత్సలతో తన కుమార్తెకు మునపటి జీవితం దక్కుతుందని ఆశపడ్డాడు. అయితే శస్త్రచికిత్సలకు అవసరమైన రూ.3 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో దిక్కుతోచని అసహాయ స్థితిలో శేఖర్ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. దాతలెవరైనా ముందుకొచ్చి తమ కుమార్తె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేదన్నారు శస్త్రచికిత్సతోనే నా కుమార్తెకు సోకిన జబ్బుకు నయమవుతుందని తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు అంటున్నారు. ఇందుకు సుమారు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని అంటున్నారు. అంతకు ముందు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇక్కడ సాధ్యం కాదని వారు చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – శేఖర్, విద్యార్థిని తండ్రి స్పెషలిస్టు దగ్గరకు తీసుకెళ్లాలి విద్యార్థిని స్నేహలతకు కుడి రొమ్ము పైభాగాన ఎర్రగా మారి తీవ్రమైన సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పిత్తాశయానికి ఇన్ఫెక్షన్ సోకింది. దీని వల్ల ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. స్పెషలిస్టుల వద్ద చూపించి, శస్త్రచికిత్స చేయిస్తే తప్ప కోలుకోని పరిస్థితి. ఇందుకు సంబంధించి ఖర్చు కూడా భారీగానే ఉంటుందని అంచనా. – డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ చందన(గైనకాలజిస్ట్), నల్లమాడ మండల వైద్యాధికారులు -
ఆ మందులు వాడుతున్నారా.. కాస్త జాగ్రత్త!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఆర్నెల్లుగా మెడ, చెవుల వద్ద దురద వస్తోంది. నేను రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ధరించడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ రాస్తున్నా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? - సునీత, కర్నూలు డర్మటైటిస్ అనేది ఒక చర్మవ్యాధి. శరీరంలో పేరుకుపోయి విషపదార్థాలు దీనికి కారణాలు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. కాంటాక్ట్ డర్మటైటిస్: ఈ రకం చర్మవ్యాధిలో చర్మం గులాబీ లేదా ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. రబ్బరు తొడుగులు లేదా ఆభరణాలు, నికెల్/కోబాల్ట్ వంటి లోహాల వల్ల ఈ తరహా అలర్జీ కలుగుతుంది. జుట్టురంగులు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల కూడా ఇది రావచ్చు. నుములార్ డర్మటైటిస్: ఈ తరహా చర్మవ్యాధిలో నాణెం ఆకృతిలో ఎరుపు మచ్చలు వస్తాయి. ఇవి సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. దీర్ఘకాలిక చర్మ ఇన్ఫెక్షన్ను ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపురంగులోకి మారడం, కమిలినట్లు కావడం, కొద్దిగా పొరలుగా తయారు కావడం కనిపిస్తాయి. ఎగ్జిమా బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపురంగులోకి మారి, ఆ తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. అవి క్రమంగా నీటిపొక్కులగా కూడా మారవచ్చు. సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా ముఖం, నెత్తి మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. దీని తీవ్రతవల్ల జుట్టు రాలవచ్చు. కారణాలు: డర్మటైటిస్‌కు చాలా కారణాలు ఉంటాయి. అవి... కొన్ని రకాల మందులు జుట్టుకు వాడే రంగులు జంతు చర్మాలతో తయారయ్యే వస్తువులు రోల్డ్‌గోల్డ్ నగలు బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. చికిత్స: డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్ క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్, వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా తగ్గుతుంది. - డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 60. ఏడాది క్రితం బై-పాస్ ఆపరేషన్ అయ్యింది. ఆ తర్వాత కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి, రక్తం పలచగా ఉండటానికి డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. అయితే రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయని కొందరు మిత్రులు చెప్పారు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తప్రసరణ త్వరగా ఆగదని అంటున్నారు. ఈ విషయంపై నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. జనార్దన్, చిత్తూరు గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గుండె పంపింగ్ సరిగా లేకపోతే ఆపరేషన్ కంటే ముందుగా బీటా బ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్ వంటి మందులతో గుండె పంపింగ్‌ను సరిచేయవచ్చు. రక్తాన్ని పలచబార్చే మందుల్లో ప్లేట్లెట్స్ కణాల మీద ప్రభావం చూపేవీ, రక్తం గడ్డ (క్లాట్) మీద ప్రభావం చూపేవీ రెండు రకాలు ఉంటాయి. యాంటీప్లేట్లెట్ (యాస్పిరిన్, క్లోపెడోగ్రెల్) వల్ల రక్తస్రావం అయ్యే అవకాశాలు తక్కువ. కానీ యాంటీకోయాగ్యులెంట్స్ మీద ఉంటే మాత్రం (ఎసిట్రోమ్, వార్‌ఫేరిన్ ఇచ్చినట్లయితే) అప్పుడు రక్తస్రావం కాకుండా, దెబ్బలేమి తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మందులు వాడే వారిలో రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనా కారణం వల్ల రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేకాకుండా ‘ఐఎన్ఆర్’ను 2 నుంచి 3 మధ్యలో ఉంచుకోవాలి. నాకు ఐదు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. తక్షణం హాస్పిటల్ వెళ్లాం. అక్కడ హార్ట్ ఎటాక్ అని చెప్పి యాంజియోగ్రామ్ చేసి, స్టెంట్ అమర్చారు. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. ఇప్పుడు నేను అన్ని పనులూ చేసుకోవచ్చా? మందులు ఎన్ని రోజులు వాడవలసి ఉంటుందో వివరించండి? - శ్రీనివాసరావు, కొత్తగూడెం ఇప్పుడు మీ హార్ట్ పంపింగ్ ప్రక్రియ అంతా నార్మల్‌గానే ఉందని మీ లేఖలోని వివరాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి గుండెజబ్బు రాకముందు మీరు ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని ఆహారనియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మంచిది. ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ మాత్రలు తప్పనిసరిగా ఒక ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వాడాలి. అవేగాక స్టాటిన్స్ వంటి మందులు జీవితాంతం వాడాలి. కాబట్టి వాటిని మీ కార్డియాలజిస్ట్ సూచించిన మోతాదులో వాడుతుంటే ఇకపై మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కొత్త జనరేషన్ స్టెంట్ల మన్నిక ఎక్కువ కాబట్టి తిరిగిపూడుకుపోతాయనే భయం లేదు. - డాక్టర్ సి. రఘు కార్డియాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్స్ అమీర్‌పేట, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కెరీర్ మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. మరో 3 - 5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పుడు సమస్యల్లా ఇలా వైవాహిక జీవితాన్ని వాయిదా వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే విషయంలో ఏమైనా సమస్యలు వస్తాయా? నాలో అండం ఉత్పత్తి కావడం, వాటి పనితీరులో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? దయచేసి వివరంగా చెప్పండి. - సునంద, హైదరాబాద్ సంతాన సాఫల్యం విషయంలో వయసు చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల ఉత్పత్తి, వాటి నాణ్యత తగ్గుతుంటుంది. పైగా మీరు పెళ్లి చేసుకోవాలన్న సమయానికి మీ రుతుక్రమం కూడా ఆగిపోయే వయసు వస్తుంది. ఆ సమయంలో గర్భధారణ అవకాశాలు తగ్గవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 38 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు మీ అండాల సామర్థ్యాన్ని తెలుసుకోడానికి చాలా మంచి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మీ ఒవేరియన్ సమర్థతను కొన్ని రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులలో త్వరగా మెనోపాజ్ వచ్చే మెడికల్ చరిత్ర ఉంటే మీకూ రుతుస్రావం త్వరగా ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఫైబ్రాయిడ్స్, ట్యూబ్‌లకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డయాబెటిస్, హైబీపీ వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇవన్నీ గర్భధారణతో పాటు, గర్భస్రావాలనూ పెంచవచ్చు. పైగా పెద్ద వయసులో నెల తప్పిన వాళ్లలో పిండంలో క్రోమోజోముల సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికం అవుతుంటాయి. పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కెరియన్ ప్లానింగ్‌కూ, కుటుంబ జీవితానికీ సమతౌల్యం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా ఫెర్టిలిటీ నిపుణులతో చర్చించి, వారి నుంచి సలహాలూ, సూచనలు తీసుకోండి. మీ అండాలను భద్రపరిచేలా అవకాశాలను పరిశీలించి, వారు మీకు సరైన రీతిలో మార్గనిర్దేశనం చేస్తారు. - డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
ఎగ్జిమా
ఆయుర్వేద శాస్త్రానుసారం ఎగ్జిమా వ్యాధిని విచర్చికా వ్యాధిగా పిలుస్తారు. ఇది ఒక చర్మవ్యాధి. ఈ వ్యాధి మన శరీరంలో రోగ నిరోధక శక్తి హెచుతగ్గుల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. పెద్దవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అకాల ఆహార విహారాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అజిన్ల వలన జీర్ణశక్తి తగ్గి పిత్తదోషం ప్రకోపించిదీనివలన ఆమము అనే విషపదార్థాలు శరీర కణాల్లో ఏర్పడి చర్మ భాగాన్ని దూషింప జేస్తాయి. ఈ కారణాల వలన విచర్చికా వ్యాధి ప్రారంభమవుతుంది. ఇది 3 రకాలుగా వర్ణిస్తారు. 1. వాత దోష విచర్చికా: చర్మం పొడి బారినట్లు ఉండి, నొప్పి, దురద ఉంటుంది. 2. కఫ దోష విచర్చికా: చర్మం దళసరిగా ఉండి దురద, తేమ కలిగి ఉంటుంది. 3. పిత్త రోష విచర్చికా: మంట, జ్వరం మొదలైన లక్షణాలతో చర్మం చిట్లినట్లు ఉంటుంది. వ్యాధి కారణాలు.. శీతల పదార్థాలు, ఉప్పు, కారం, మసాలాలు, అధిక మోతాదులో కలిగిన పదార్థాలు తీసుకోవటం వలన, నిల్వ ఆహారం తీసుకోవటం, నూనెతో చేసిన పదార్థాలు వాడటం వలన, నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయటం, ఆల్కహాల్, టీ, కాఫీలు అధికంగా సేవించటం, మలబద్ధకం, అజీర్తి, ఒత్తిడి ఈ వ్యాధికి ముఖ్య కారణాలు. లక్షణాలు: దురద, చర్మం ఎర్రగా ఉండటం, ఎండిన చర్మం, చర్మంపై పొలుసులుగా ఏర్పడటం, వాపు, దురద, చర్మం మందబారటం, పొక్కులుగా ఏర్పడటం మొదలైన లక్షణాలు. తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. నూనె వస్తువులు, మసాలా, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. 2. ఔషధ గుణాలు కల సబ్బులు వాడాలి. 3. రోగి దుస్తులు వేరొకరు వేసుకోరాదు. 4. వేళకు భోజనం చేయాలి. రాత్రి పూట ఎక్కువగా మేల్కొనరాదు. 5. ఒత్తిడి, ఆలోచనలు మానుకోవాలి. 6. చల్లిని గాలిలో, అతి ఎండలో తిరగరాదు. ఆయుర్వేద వైద్యంలో చక్కని ఔషధాలు విచర్చికా వ్యాధికి అందుబాటులో ఉన్నాయి. అనుభవం కలిగిన వైద్యుల సమక్షంలో వ్యాధి నిర్థారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే శాశ్వతంగా ఎగ్జిమా వ్యాధిని నివారించుకోవచ్చు. -
చిన్నారులకు వాచ్మెన్ వైద్యం
-
సోరియాసిస్ సమస్యకు హోమియోకేర్ పరిష్కారం
చలికాలం రాగానే చాలామంది చర్మ సంబంధిత రోగులలో వ్యాధి తీవ్రత పెరిగి వైద్యుని దగ్గరకు పరుగులు తీస్తుంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య ‘సోరియాసిస్’. చాలామంది రోగులు ఇది సాధారణ చర్మవ్యాధి అనుకుంటారు. కాని ఇది రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మ సంబంధిత వ్యాధి అని చాలా తక్కువమందికి తెలుసు. కనుక ‘సోరియాసిస్’ వచ్చిన రోగులలో జబ్బును కేవలం పై పూతలతోనే నయం చేయలేం. ప్రపంచ జనాభాలో సుమారుగా 3 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగి మరణానికి దారి తీయదు. కాని రోగి ఈ జబ్బుతో సంవత్సరాల తరబడి బాధపడటం వలన ఇది సామాజిక రుగ్మతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది. సోరియాసిస్ అంటే... సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా కొనసాగే చర్మవ్యాధి. ఇందులో ముఖ్యంగా చర్మంపై దురదలతో కూడుకున్న వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి.సోరియాసిస్‌లో ముందుగా చర్మం ఇన్ఫ్లమేషన్కు గురి అయి ఎర్రగా మారి క్రమంగా చర్మం వెండి రంగు పొలుసుల రూపంలో రాలిపోవడం జరుగుతుంది. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అధికమవుతాయి. ఈ వ్యాధి చర్మంతో పాటు గోళ్ళు, కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతుడి చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరంగా తయారవుతాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పైపొరగా ఏర్పడిన కణాలు క్రమేణా నిర్జీవమై పొలుసులుగా రాలిపోయి కింది కణాలను బహిర్గతం చేస్తాయి. కాని రోగనిరోధక శక్తి వికటించి శరీర కణాలపై దాడి చేయడం వలన వచ్చే సోరియాసిస్ వ్యాధి వలన ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మకణాలు వేగంగా తయారై 3-4 రోజులకే వెలుపల పొరకు చేరుకుంటాయి. ఈ విధంగా పైకి చేరిన కణాలు వేగంగా చనిపోవడం, కొత్త కణాలు లోపల నుండి ఏర్పడటం ... ఈ మొత్తం ప్రక్రియ త్వరత్వరగా పూర్తి కావడం వలన వెలుపలి పొర ఊడిపోక ముందే కొత్త పొర రావడం వలన చర్మం పొలుసులుగా రాలిపోతుంది. కారణాలు: సోరియాసిస్‌కు గల కారణాలు జన్యుపరమైన కారణాలు లేక మానసిక ఒత్తిడి వలన కాని రావచ్చు అని అనుభవ పూర్వకంగా తెలుస్తోంది. రోగ నిరోధక వ్యవస్థలోని అసమతుల్యతల వలన కూడా రావచ్చు. దీర్ఘకాలికంగా కొన్నిరకాల మందులు వాడటం వలన ‘సోరియాసిస్’ జబ్బు రావచ్చు. రకాలు సోరియాసిస్ వల్గారిస్: ఇది సాధారణంగా కనిపించేదే. స్కిన్‌పై ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొలుసుగా మారడం దీని ప్రధాన లక్షణం. గట్టేట్ సోరియాసిస్: ఇది సాధారణంగా పిల్లలలోనూ, యుక్త వయస్కులలోనూ వస్తుంది. దీనిలో చర్మంపై చిన్న పొక్కులు, ఎర్రని మచ్చలు వస్తాయి మొదటి దశలో ఉండగానే చికిత్స ప్రారంభిస్తే దీన్ని సంపూర్ణంగా నయం చేయవచ్చు. పస్చులర్ సోరియాసిస్: ఇది అరుదుగా కనిపించే సోరియాసిస్ రకం. దీనిలో సాధారణంగా చర్మంపై చీముతో నిండిన పొక్కులు కనిపిస్తాయి. ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్: ఇది కొంచెం ప్రమాదకరమైన దే. ఇది శరీరంలో చాలా భాగం చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిలో పొలుసులు పెద్దగా ఊడిపోతాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే శరీరంలో ఉండే ధాతువుల్లో అసమతుల్యత చోటు చేసుకోవడం, ప్రొటీన్లు కోల్పోవటం జరుగుతుంది. ఇన్వర్స్ సోరియాసిస్: ఇది ముఖ్యంగా చర్మం మడతలలో వస్తుంది. కాంప్లికేషన్స్: సోరియాటిక్ ఆర్థరైటిస్ ఊ మానసిక అశాంతి, ఊలవణాలు, విటమిన్ లోపాలకు దారి తీస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు ఊ అధికంగా నీరు తాగడం ఊ అధికంగా ప్రొటీన్లు కల ఆహారాన్ని తీసుకోవడం ఊ చర్మం పొడి బారకుండా కొబ్బరినూనె, మాయిశ్చరైజర్ రాయడం ఊ పొడి చేసిన అవిశ గింజలను రోజూ తీసుకోవడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచడానికి కావలసిన ఒమెగా 3 కొవ్వు ఆమ్లం సోరియాసిస్ని కొంత వరకు అదుపులో ఉంచవచ్చు ఊ రోజూ వ్యాయామం చేయడం ఊ రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం ఉండటం. సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి. పొలుసులు ఏర్పడటం తగ్గిస్తుంది ఊ చలికాలం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, కొన్ని ఇతర ఔషధాల వలన వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. నిర్థారణ పరీక్షలు : ఊ సీబీపీ ఊ ఈఎస్ఆర్ ఊ స్కిన్ బ్లాప్సీ ఊ కీళ్లను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేస్తారు. హోమియో చికిత్స: చాలామంది సోరియాసిస్ రోగులు ఆత్రుతతో వైద్యులను, వైద్య విధానాలను త్వరగా మారుస్తూ ఉంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. సోరియాసిస్ వైద్యం తీసుకునే రోగి ఏదో ఒక వైద్య విధానాన్ని ఎంచుకొని దీర్ఘకాలం ఓపికగా వైద్యం చేయించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం విధానం ద్వారా, సోరియాసిస్ రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోని వికటించిన రోగ నిరోధక వ్యవస్థను సరిచేసి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. లక్షణాలు సోరియాసిస్ తల, మోచేతులు, మోకాళ్ళు, అరి చేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావితం చేస్తుంది ఊ చర్మం ఎర్రబడటం ఊ సాధారణ నుండి అతి తీవ్రమైన దురద ఊ చర్మంపై వెండిరంగు పొలుసులు ఊడిపోవడంఊ సోరియాసిస్ తలలో ఉన్నప్పుడు పొలుసులు రాలడంతో పాటు జుట్టు రాలిపోవడం ఊ అరిచేతులు, అరిపాదాలు చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పగలడం వలన తీవ్రమైన నొప్పి ఉండవచ్చు ఊ సోరియాసిస్ గోర్లను ప్రభావితం చేస్తే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి ఊ సోరియాసిస్ వ్యాధి తీవ్రంగా ఉండే కీళ్లను ప్రభావితం చేసి కీళ్లనొప్పులకు దారి తీస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
సోరియాసిస్‌కి హోమియో వైద్యం
దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం స్త్రీ, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సోరియాసిస్ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఉత్పాతాలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో నలిగిపోతున్నారు. అయితే హోమియో వైద్య విధానం సూచించిన సంపూర్ణ శారీరక, మానసిక తత్వశాస్త్రాన్ని అనుసరించి, సత్వర పరిష్కారాల కోసం చూడకుండా శాశ్వత స్వాంతన చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధి మీద అంతిమ విజయం సాధించవచ్చు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలంపాటు కొనసాగే చర్మవ్యాధి. చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు, పొడలు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపునీ కలిగి ఉండవచ్చు. కేవలం చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల తదితర శారీరక భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. మొదట్లో సోరియాసిస్ మచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచేకొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. పొలుసులను తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి. దురద ప్రధాన లక్షణం కాదు. అయితే వాతావరణం చల్లగా ఉండి, తేమ తగ్గిపోయినప్పుడు కాని, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడు గానీ, తీరుబడిగా ఉన్నప్పుడుగానీ దురద ఎక్కువవుతుంది. బాధితుల్లో 10-20 శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా వ్యాపిస్తాయి. ఎందుకు వస్తుంది? వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వల్ల సోరియాసిస్ వస్తుందని ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడిచేసినప్పుడు వాటినుంచి రక్షణ పొందడానికి, అవి ఏర్పరచిన అపశ్రుతులను సరిచేయటానికి మన శరీరంలో తెల్లరక్తకణాలనే ప్రత్యేకమైన కణాలు పనిచేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలను మానేలా చేస్తాయి. దీనినే వ్యాధినిరోధక శక్తి అంటున్నాం. ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్ఫ్లమేషన్ (ఎరుపుదనం, వాపు) తయారవుతుంది. సోరియాసిస్‌లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. ఇది శరీర కణజాలాన్ని (చర్మ కణజాలం) అన్యపదార్థంగా అన్వయించుకొని, దాడి చేసి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. దాంతో చర్మకణాలు అనియతంగా పెరిగే పొలుసులుగా తయారవుతాయి. అయితే వ్యాధి నిరోధక శక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాలవల్ల జరుగువచ్చు. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు ప్రేరకాలుగా పనిచేస్తాయి. సోరియాసిస్ రకాలు సోరియాసిస్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. స్థూలంగా అవి 1) సోరియాసిస్ వల్గారిన్ 2) గట్టేట్ సోరియాసిస్ (గట్టా అంటే బిందువు) 3) పుస్టులార్ (పస్ అంటే చీము) 4)ఎరిత్రో డెర్మల్ సోరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపు). చికిత్సా విధానం - హోమియోపతి దృక్పథం ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్ధాంతంపై హోమియోపతి వైద్యవిధానం ఆధారపడి ఉంది. దీనినే లాటిన్లో ‘సిమిలియా సిమిలిబస్ క్యూరేంటర్’ అంటారు. ఇంచుమించు మన ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ లాంటిదని చెప్పవచ్చు. ఒకే రకమైన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్నవ్యక్తులు భిన్నభిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదంపైన హోమియోపతి ఆధారపడి ఉంది. దీన్నే మూర్తిత్వమంటారు. హోమియోపతికి మాత్రమే సంబంధించిన విలక్షణ అంశమిది. సోరియాసిస్ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక - శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకుని మందులను సూచిస్తారు. అయితే చికిత్సా ఫలితాలు ఆహార, వ్యవహార, ఔషధాల సమిష్టి ప్రయోగాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి ఉంటాయి. సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సెనికం ఆల్బం (శీతాకాలం ఎక్కువగును), సల్ఫర్, కాలి ఆర్క్, సోరినమ్, మెజీరియం, పెట్రోలియం వంటి మందులను వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. అసలు ఈ వ్యాధిఎలా వస్తుంది? మామూలుగా ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరమూ తయారవుతుంటాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పై పొరగా ఏర్పడినవి క్రమంగా నిర్జీవమై ఊడిపోయి కింది కణాలను బహిర్గత పరుస్తాయి. సోరియాసిస్ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపలకు చేరుకుంటాయి. అదనపు కణసముదాయానికి పోషకత్వాలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది. దీనితో చర్మంపైన ఎర్రని పొడ తయారవడం, పొలుసులు ఏర్పడడం జరుగుతాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109