
సినిమా మ్యాజిక్కే వేరు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించడం సినిమాకు చాలా మామూలు విషయం. అందుకు తాజా ఉదాహరణ చిరంజీవి లుక్. ఇటీవలే చిరంజీవి గుండుతో ఉన్న లుక్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన తదుపరి చిత్రాల్లో ఓ సినిమాకు సంబంధించిన లుక్ అని తెలిపారు. అయితే నిజంగానే చిరు గుండు చేయించుకున్నారని చాలామంది భావించారు. కొంతమంది చేయించుకోలేదన్నారు. ఆ లుక్ కేవలం ట్రిక్ అని మంగళవారం అసలు విషయం బయటపెట్టారు చిరంజీవి. మేకప్ టెక్నిక్‌తొ ఆ లుక్ ట్రై చేశాం అని, ఆ లుక్ కోసం ఎలా శ్రమించారో ఓ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ‘‘ఎటువంటి లుక్ అయినా సరే నిజమేమో? అని నమ్మించగలిగే సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. సినిమా మ్యాజిక్‌కు సెల్యూట్’’ అన్నారు చిరంజీవి.
Comments
Please login to add a commentAdd a comment