అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్‌గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్, బ్రెజిల్‌లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్ సీక్రెట్‌ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ.
అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం.
ఆ బామ్మ ఎవరంటే..
చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న నాన్‌చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.
ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..
హెల్త్ సీక్రెట్..
తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట.
తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.
(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!)
Comments
Please login to add a commentAdd a comment