WhatsApp says it is working on 'View Once Text' feature - Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌: ‘సీక్రెట్’ ఫీచర్‌ ఒక్కసారే!

Published Wed, Dec 14 2022 1:25 PM | Last Updated on Wed, Dec 14 2022 3:16 PM

WhatsApp Working On View Once Text Feature Details Inside - Sakshi

సాక్షి, ముంబై:   మెటా  యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్  తన  యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్‌ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్‌ తాజాగా కొత్త ఫీచర్‌పై  పరీకక్షిస్తోంది.  వ్యూ వన్స్‌  టెక్ట్స్  ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

ఇదీ చదవండి: లేడీ బాస్‌ సర్‌ప్రైజ్‌ బోనస్‌ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!

వాట్సాప్‌లో మెసేజ్‌ను ఒకసారి రిసీవర్‌ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్‌ చదవిన వెంటనే ఆ మెసేజ్‌  ఆటో మేటిక్‌గా డిలీట్‌ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్‌ కనపించదు. తమ వాట్సాప్‌ చాట్‌ను ఎవరూ చూడకుండా సీక్రెట్‌గా  ఉండాలనుకునే యూజర్లకు  ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్‌ అవతార్‌ వచ్చేసింది..మీరూ కస్టమైజ్‌ చేసుకోండి ఇలా!)

వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్‌ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం  ప్రస్తుతానికి సస్పెన్స్‌.  వాట్సాప్‌ అధికారికంగా లాంచ్‌ చేసేవరకు వెయిట్‌ చేయాల్సిందే.

కాగాఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్‌ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు.  ఇదే ఫీచర్‌ను టెక్ట్స్  ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్‌ను  పరీక్షిస్తుండటం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement