రామ్ గోపాల్ వర్మ 'సీక్రెట్' పోస్టర్ విడుదల | Official poster of RGV's new film Secret released | Sakshi
Sakshi News home page

రామ్ గోపాల్ వర్మ 'సీక్రెట్' పోస్టర్ విడుదల

Published Sun, Jun 7 2015 1:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

రామ్ గోపాల్ వర్మ 'సీక్రెట్' పోస్టర్ విడుదల

రామ్ గోపాల్ వర్మ 'సీక్రెట్' పోస్టర్ విడుదల

ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సీక్రెట్. ఆ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ను వర్మ ఆదివారం ముంబైలో ఆవిష్కరించారు. దాదాపు రెండేళ్ల తర్వాత హిందీలో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు.2013, నవంబర్ లో హిందీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన సత్య 2 విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొదటి హిందీ చిత్రం సీక్రెట్ను నిర్మిస్తున్నట్లు  ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ఈ చిత్రానికి ముందు టైటిల్ గా 'ద ఎఫైర్' అనుకున్నామని కానీ సీక్రెట్ పేరు ఖరారు చేశామన్నారు.

ఈ చిత్రంలో సచిన్ జోషి, కైనత్ అరోరా, టిస్కా చోప్రా, మీరా చోప్రాలు నటిస్తున్నారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కాగా ఈ చిత్రం తెలుగులో మొగలిపువ్వు పేరుతో  విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామ్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన చిత్రం ఖైదీ. ఈ చిత్రంలోని రగులుతుంది మొగలిపోద అనే పాట నుంచి ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు గతంలోనే వర్మ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement