హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ షిప్‌లో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది.
అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్ సమాచారం. వీరి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్. తాప్సీ మెయిన్ లీడ్‌గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా థిల్లాన్ తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దీంతో వీరు హాజరైంది తాప్సీ వివాహానికే అనే ప్రచారం జరుగుతోంది. మరి.. తాప్సీ, మథియాస్ పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment