నాట్ ఎలోన్!
ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న బాలీవుడ్ సెక్సీ తార కంగనా రనౌత్ ఎట్టకేలకూ జతగాడిని వెతుక్కుంది. ఈ సీక్రెట్‌ను ఆమె విప్పి చెప్పింది. అయితే అతగాడెవరనేది ప్రస్తుతానికి సస్పెన్సట! ఇంత అద్భుతమైన బాయ్‌ఫ్రెండ్ దొరికినందుకు తనకెంతో ఆనందంగా ఉందంటోంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్‌తో ‘కట్టి బత్తి’ సినిమాలో చేస్తున్న కంగనా... ‘అతడెవరో బయటపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. సందర్భం వచ్చినప్పుడు అందరికీ చెబుతా. నిజానికి బంధాలు ఎంతో క్లిష్ట మైనవి. కాదంటారా! అవి ఆరోగ్యకరంగా లేకపోతే తరువాత బాధపడాల్సి వస్తుంది. ఆ విషయంలో నేను లక్కీ. మంచి జతగాడిని పొందగలిగా’ అంటూ చెప్పుకొచ్చిందీ చిన్నది.