టాలీవుడ్ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్‌లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్‌నెస్ అనేది రోజు బ్రెష్ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్‌లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్ చేస్తుందంటే..
తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్ తింటుందంటే..
బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి అవి..
గ్లూటెన్ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్ ప్రారంభిస్తుంది. ప్రోటీన్ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్‌లు తీసుకుంటుందట.
లంచ్ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్‌లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది.
అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన ప్రోటీన్ రిచ్ డిన్నర్‌కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది.
(చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!)
Comments
Please login to add a commentAdd a comment