వైద్య సంరక్షణలో కళను నింపడం ద్వారా ప్రజలలో ఆరోగ్య అక్షరాస్యతను పెంచడానికి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు కళాకారులు. తమ సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించారు. పుణెలో జరిగిన ఈ హెల్త్ ఆర్ట్ కార్యక్రమం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
పాయిజన్ అండ్ యాంటి డోట్’ పెయింటింగ్ ద్వారా కళాకారుడు సాగర్ కాంబ్లే కొంకణ్ ప్రాంతంలోని కఠినమైన వాస్తవాలను చిత్రించాడు. ఈ ప్రాంతంలో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉండటం, తేలు కుట్టిన చికిత్సపై పరిశోధనలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్రావు బావస్కర్ ఎలా ప్రసిద్ది చెందాడు, ప్రాణాలను ఎలా కాపాడారు? అనేది పెయింటింగ్స్ ద్వారా చూపారు.
పోషకాహార లోపం... ఓ చిత్రణ
‘ఎ టేల్ ఆఫ్ డ్యూయల్ బర్డెన్’ అనే తన కళాకృతిలో జరా షేక్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్ యాజ్నిక్ పరిశోధనను దృశ్యంగా చూపారు. ఇది పోషకాహార లోపం– రెట్టింపు భారం‘ గురించి నొక్కి చెబుతుంది. పోషకాహార లోపం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఊబకాయం, మధుమేహం పెరగకుండా నిరోధించడానికి, పునరుత్పత్తి సమయాలలో మహిళలకు సాధికారత, మద్దతు అవసరం గురించి తెలియజేస్తుంది.
‘రంగ్ దే నీలా’ అనే ఈ వినూత్న ప్రాజెక్ట్ ‘హీలింగ్ జర్నీస్’లో ఒక ప్రత్యేక భాగం. ఆర్ట్ మీట్స్ హెల్త్ అనే క్యాప్షన్‌తో ఆరోగ్య విద్యలో చొరవ చూపుతుంది. రంగ్ దే నీలా వ్యవస్థాపకుడు అమీ షా వైద్య నిపుణుల సహకారంతో 100 కళాకృతుల సేకరణ ద్వారా ఈ కథలకు జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
వర్క్‌షాప్స్
కళ ద్వారా ఆరోగ్య అక్షరాస్యత, శ్రేయస్సు భావాన్ని పెంపొందించడానికి అమి షా ‘రంగ్ దే నీలా‘ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. మొదట ‘రంగ్ దే నీలా’ గ్రామీణ వర్క్‌షాప్‌లతో ప్రారంభమైంది. ఇక్కడ కళాకారులు, వైద్యులు కళను రూపొందించడానికి సహకరించారు. వర్క్‌షాప్‌లలో పాల్గొన్న కళాకారులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో చర్చించారు. వైద్య నిపుణులు మాత్రం భావోద్వేగాలు నింపుకున్న కళాకారులుగా కొత్త ప్రశంసలను ΄పొందారు.
ర్యాంప్‌పై నడక
ఈ సందర్భంగా నిర్వహించిన ‘వాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్‘లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకున్న రోగులు వైద్యులతోపాటు ర్యాంప్‌పై నడిచారు. చీర సంప్రదాయాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా అందించారు. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలను నివారించడం, వైకల్యాలు ఉన్నప్పటికీ బాగా జీవించడం, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడానికి తోలుబొమ్మలాటనూ ప్రదర్శించారు.
వైద్యులను ప్రోత్సహించడానికి...
హీలింగ్ జర్నీ ద్వారా వివిధ రోగాల నుంచి కోలుకున్న 100 స్ఫూర్తిదాయకమైన కథనాల సమాహారాన్ని అందించారు. ‘గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, ఇతర అనారోగ్యాలతో పోరాడిన వ్యక్తులు నొప్పి నుండి ఎలా నయం అయ్యారనే దాని గురించి వారి కథనాలను పంచుకున్నారు. ఈ కథలను తీసుకొని వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మార్చడమే మా లక్ష్యం’ అని షా అన్నారు.
ప్రస్తుతం పూణేలో ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడానికి, వైద్యులను ప్రోత్సహించడానికి, షా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 40 కథలు రికార్డ్ చేశాం, 28 కాన్వాస్‌లు పూర్తయ్యాయి. ‘ప్రజలు, కమ్యూనిటీలు మరింత ఆరోగ్య–అక్షరాస్యులుగా మారడానికి ఆరోగ్యం పట్ల వారి వైఖరిని మార్చడానికి కళలను కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం‘ అని షా చె΄్పారు.
Comments
Please login to add a commentAdd a comment