project area
-
కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!
వైద్య సంరక్షణలో కళను నింపడం ద్వారా ప్రజలలో ఆరోగ్య అక్షరాస్యతను పెంచడానికి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు కళాకారులు. తమ సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించారు. పుణెలో జరిగిన ఈ హెల్త్ ఆర్ట్ కార్యక్రమం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.పాయిజన్ అండ్ యాంటి డోట్’ పెయింటింగ్ ద్వారా కళాకారుడు సాగర్ కాంబ్లే కొంకణ్ ప్రాంతంలోని కఠినమైన వాస్తవాలను చిత్రించాడు. ఈ ప్రాంతంలో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉండటం, తేలు కుట్టిన చికిత్సపై పరిశోధనలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్రావు బావస్కర్ ఎలా ప్రసిద్ది చెందాడు, ప్రాణాలను ఎలా కాపాడారు? అనేది పెయింటింగ్స్ ద్వారా చూపారు.పోషకాహార లోపం... ఓ చిత్రణ‘ఎ టేల్ ఆఫ్ డ్యూయల్ బర్డెన్’ అనే తన కళాకృతిలో జరా షేక్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్ యాజ్నిక్ పరిశోధనను దృశ్యంగా చూపారు. ఇది పోషకాహార లోపం– రెట్టింపు భారం‘ గురించి నొక్కి చెబుతుంది. పోషకాహార లోపం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఊబకాయం, మధుమేహం పెరగకుండా నిరోధించడానికి, పునరుత్పత్తి సమయాలలో మహిళలకు సాధికారత, మద్దతు అవసరం గురించి తెలియజేస్తుంది. ‘రంగ్ దే నీలా’ అనే ఈ వినూత్న ప్రాజెక్ట్ ‘హీలింగ్ జర్నీస్’లో ఒక ప్రత్యేక భాగం. ఆర్ట్ మీట్స్ హెల్త్ అనే క్యాప్షన్‌తో ఆరోగ్య విద్యలో చొరవ చూపుతుంది. రంగ్ దే నీలా వ్యవస్థాపకుడు అమీ షా వైద్య నిపుణుల సహకారంతో 100 కళాకృతుల సేకరణ ద్వారా ఈ కథలకు జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వర్క్షాప్స్కళ ద్వారా ఆరోగ్య అక్షరాస్యత, శ్రేయస్సు భావాన్ని పెంపొందించడానికి అమి షా ‘రంగ్ దే నీలా‘ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. మొదట ‘రంగ్ దే నీలా’ గ్రామీణ వర్క్‌షాప్‌లతో ప్రారంభమైంది. ఇక్కడ కళాకారులు, వైద్యులు కళను రూపొందించడానికి సహకరించారు. వర్క్‌షాప్‌లలో పాల్గొన్న కళాకారులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో చర్చించారు. వైద్య నిపుణులు మాత్రం భావోద్వేగాలు నింపుకున్న కళాకారులుగా కొత్త ప్రశంసలను ΄పొందారు.ర్యాంప్‌పై నడకఈ సందర్భంగా నిర్వహించిన ‘వాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్‘లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకున్న రోగులు వైద్యులతోపాటు ర్యాంప్‌పై నడిచారు. చీర సంప్రదాయాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా అందించారు. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలను నివారించడం, వైకల్యాలు ఉన్నప్పటికీ బాగా జీవించడం, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడానికి తోలుబొమ్మలాటనూ ప్రదర్శించారు.వైద్యులను ప్రోత్సహించడానికి...హీలింగ్ జర్నీ ద్వారా వివిధ రోగాల నుంచి కోలుకున్న 100 స్ఫూర్తిదాయకమైన కథనాల సమాహారాన్ని అందించారు. ‘గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, ఇతర అనారోగ్యాలతో పోరాడిన వ్యక్తులు నొప్పి నుండి ఎలా నయం అయ్యారనే దాని గురించి వారి కథనాలను పంచుకున్నారు. ఈ కథలను తీసుకొని వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మార్చడమే మా లక్ష్యం’ అని షా అన్నారు.ప్రస్తుతం పూణేలో ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడానికి, వైద్యులను ప్రోత్సహించడానికి, షా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 40 కథలు రికార్డ్ చేశాం, 28 కాన్వాస్‌లు పూర్తయ్యాయి. ‘ప్రజలు, కమ్యూనిటీలు మరింత ఆరోగ్య–అక్షరాస్యులుగా మారడానికి ఆరోగ్యం పట్ల వారి వైఖరిని మార్చడానికి కళలను కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం‘ అని షా చె΄్పారు. -
వరదల ఎఫెక్ట్: ముంపులో లంక గ్రామాలు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధారల నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో, లంక గ్రామాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం నుంచి మొత్తం 4.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోని నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు 3.50 లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు.. పులిచింతల గేట్లు 20 ఎత్తివేత వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి లక్ష క్యూసెక్కులను సముద్రంలోకి చేరుతోంది. కాగా, రాత్రికి వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో, సాగర్ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగింది. పోలవరంలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక, ధవళేశ్వరం నుంచి 13.76 లక్షల క్యూసెక్కులు సముద్రంలకి వచ్చి చేరుతోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 25 వేల క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు -
డెల్టా ఆధునికీకరణపై దృష్టి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి సారించినట్టు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పనులను ఒకే సీజన్లో పూర్తి చేయాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి వచ్చిన ఆయన పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డెల్టా ఆధునికీకరణ పనులు ఏ మేరకు జరిగాయి, చేపట్టాలి్సనవి ఏమిటనే దానిపై సమీక్షిం చామన్నారు. మిగిలిన పనులు చేపట్టేం దుకు వీలుగా అంచనాలు రూపొందిం చాలి్సందిగా ఆదేశించామన్నారు. జూన్ 1 నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులు పంటలు వేసుకునే వీలు కల్పిస్తామని సీఎం చెప్పారు. ఇందుకోసం సీలేరు నుంచి జలాలు రప్పిస్తున్నామని, రైతులు త్వరితగతిన నారుమళ్లు పూర్తి చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దఫా పనులను ఆమోదించామని, త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం పనులపై సమీక్ష తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరుపై మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, జల వనరుల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, సీఈ రమేష్‌బాబు తదితరులతో ముఖ్య మంత్రి సమీక్షించారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ, గృహ నిర్మాణం, భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టు నిర్మాణం నిర్దేశించిన గడువు నాటికి పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పోలవరం డయాఫ్రమ్‌వాల్ పనుల్లో భాగంగా కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్మా ణం, పురుషోత్తపట్నం, తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ, పైపులైన్ల నిర్మాణానికి ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే పనిలో ఉన్నాం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే కార్యక్రమం చేపట్టామని, త్వరలో ఇళ్ళ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు భూమికి భూమిగా 450 ఎకరాలు పంపిణీ చేస్తామని, పునరావాసానికి 117 ఎకరాలు ఇచ్చామని చెప్పారు. పునరావాసానికి సంబంధించి 3,100 ఎకరాలు అవసరం ఉందని, ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. డిసెంబరు నాటికి భూమి సేకరించి నిర్వాసితులకు నష్టపరిహా రం చెల్లించి, పునరావాసం కల్పిస్తామన్నారు. పురుషోత్తపట్నం స్టేజ్–2 పనులకు 103 ఎకరాలు అవసరం ఉందని, ఇప్పటికి 183 ఎకరాలు ఫేజ్–1 ద్వారా ఎత్తిపోతలకు అప్పగించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1,055 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకు గాను ఇంతవరకూ 683.82 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. రహదారుల నిర్మాణంపై.. పోలవరం, గోపాలపురం రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జీలుగువిులి్ల–కన్నాపురం, పోలవరం–పట్టిసీమ మీదుగా కొవ్వూరు వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఏటిగట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవా లని, డెల్టా ప్రాంతాల్లోని శివార్లకు సాగునీరు వెళ్లేలా కాలువలను ఆధునికీకరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ జి.రాణి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మెంబర్ సెక్రటరీ ఆర్కే గుప్తా, జేసీ పి.కోటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, కేఆర్ పురం ఐటీడీఏ పీఓ షాన్మోహన్ పాల్గొన్నారు. -
ఎందుకొచ్చినట్టో!
పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం మండలంలో పర్యటించారు. ఆయన హఠాత్తుగా జిల్లా పర్యటనకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశం కాగా.. ఓటుకు నోటు కేసునుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆకస్మిక పర్యటనకు వచ్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన చంద్రబాబు పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులను మాత్రం కేవలం ఏరియల్ సర్వే ద్వారా చూసి వెళ్లారు. ఓటుకు నోటు కేసు వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు హఠాత్తుగా ఇక్కడకు ఎందుకొచ్చారు.. పర్యటన మధ్యలో పోలవరం స్టేట్‌బ్యాంక్ వద్ద సుమారు పావుగంటసేపు కాన్వాయ్‌ని నిలిపివేసి ఫోన్లో ఎవరితో మంతనాలు సాగించారనే దానిపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. పట్టిసీమ పనులు చూశారు.. పరిహారం మాట మరిచారు పట్టిసీమ హెడ్‌వర్క్స్, పైప్‌లైన్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులతో మాట్లాడలేదు. కనీసం ఆ రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ వద్ద మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను పరిశీలించిన సీఎం వాటికి సంబంధించిన వివరాలను మెగా ఇంజినీరింగ్ సంస్థ డెరైక్టర్ సీఎస్ సుబ్బయ్య, ఎస్ఈ ఈఎస్ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్, మ్యాప్‌లను పరిశీలించారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఎత్తిపోతల పథకం పోలవరం కుడి కాలువలో కలిసే ప్రాంతానికి వెళ్లిన సీఎం పైప్‌లైన్ నిర్మాణం, కాంక్రీట్ పనులను పరిశీలించారు. అవసరమైన పైప్‌లు సిద్ధంగా ఉన్నాయా.. పనులు పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందులేమిటనే విషయాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పథకం పనుల తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకం పనులను దాదాపు గంటపాటు ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన సీఎం దాదాపు 2.45 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అప్పటివరకు ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఆయన కోసం వేచివున్నారు. హెలిప్యాడ్ కాన్వాయ్‌లో నేరుగా హెడ్‌వర్క్స్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో పైప్‌లైన్ పనులు జరగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఖరారు కావడంతో పలు శాఖల అధికారులు రాత్రంతా మేలుకొని ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ పి.శ్రీమన్నారాయణ రాత్రిరాత్రికి ఏలూరు నుంచి సిబ్బందిని రప్పించి హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయించారు. సీఎం పర్యటనలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, పులపర్తి అంజిబాబు, బడేటి బుజ్జి, కలపూడి శివ, ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, భూసేకరణ కలెక్టర్ డి.సుదర్శన్, పార్టీ నాయకులు బొరగం శ్రీనివాస్, కుంచె దొరబాబు పాల్గొన్నారు.