డెల్టా ఆధునికీకరణపై దృష్టి
డెల్టా ఆధునికీకరణపై దృష్టి
Published Tue, May 23 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి సారించినట్టు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పనులను ఒకే సీజన్‌లో పూర్తి చేయాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి వచ్చిన ఆయన పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డెల్టా ఆధునికీకరణ పనులు ఏ మేరకు జరిగాయి, చేపట్టాలి్సనవి ఏమిటనే దానిపై సమీక్షిం చామన్నారు. మిగిలిన పనులు చేపట్టేం దుకు వీలుగా అంచనాలు రూపొందిం చాలి్సందిగా ఆదేశించామన్నారు. జూన్ 1 నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులు పంటలు వేసుకునే వీలు కల్పిస్తామని సీఎం చెప్పారు. ఇందుకోసం సీలేరు నుంచి జలాలు రప్పిస్తున్నామని, రైతులు త్వరితగతిన నారుమళ్లు పూర్తి చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దఫా పనులను ఆమోదించామని, త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.
పోలవరం పనులపై సమీక్ష
తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరుపై మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, జల వనరుల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, సీఈ రమేష్‌బాబు తదితరులతో ముఖ్య మంత్రి సమీక్షించారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ, గృహ నిర్మాణం, భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టు నిర్మాణం నిర్దేశించిన గడువు నాటికి పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పోలవరం డయాఫ్రమ్‌వాల్ పనుల్లో భాగంగా కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్మా ణం, పురుషోత్తపట్నం, తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ, పైపులైన్ల నిర్మాణానికి ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే పనిలో ఉన్నాం
జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే కార్యక్రమం చేపట్టామని, త్వరలో ఇళ్ళ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు భూమికి భూమిగా 450 ఎకరాలు పంపిణీ చేస్తామని, పునరావాసానికి 117 ఎకరాలు ఇచ్చామని చెప్పారు. పునరావాసానికి సంబంధించి 3,100 ఎకరాలు అవసరం ఉందని, ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. డిసెంబరు నాటికి భూమి సేకరించి నిర్వాసితులకు నష్టపరిహా రం చెల్లించి, పునరావాసం కల్పిస్తామన్నారు. పురుషోత్తపట్నం స్టేజ్–2 పనులకు 103 ఎకరాలు అవసరం ఉందని, ఇప్పటికి 183 ఎకరాలు ఫేజ్–1 ద్వారా ఎత్తిపోతలకు అప్పగించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1,055 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకు గాను ఇంతవరకూ 683.82 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశామన్నారు.
రహదారుల నిర్మాణంపై..
పోలవరం, గోపాలపురం రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జీలుగువిులి్ల–కన్నాపురం, పోలవరం–పట్టిసీమ మీదుగా కొవ్వూరు వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఏటిగట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవా లని, డెల్టా ప్రాంతాల్లోని శివార్లకు సాగునీరు వెళ్లేలా కాలువలను ఆధునికీకరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎండీ కె.విజయానంద్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ జి.రాణి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మెంబర్ సెక్రటరీ ఆర్‌కే గుప్తా, జేసీ పి.కోటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, కేఆర్ పురం ఐటీడీఏ పీఓ షాన్‌మోహన్ పాల్గొన్నారు.
Advertisement