పోలవరం లెక్కలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలి: సీఎం | polavaram expenses shows in online | Sakshi
Sakshi News home page

Dec 12 2017 4:06 PM | Updated on Dec 12 2017 4:06 PM

అమరావతి: పోలవరం లెక్కలన్నీ ఆన్ లైన్‌లో పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు లెక్కలపై
ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన ఈ ప్రాజెక్టుకు గతంలో పెట్టిన ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల వివరాలను పొందుపర్చాలన్నారు. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. ఖర్చుల వివరాలతోపాటు పోలవరానికి సంబంధించిన ఇతర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలని సీఎం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement