పనులు పరుగెత్తిస్తారా!
Published Mon, Nov 21 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్ :‘మీకు అనేక అవకాశాలు ఇచ్చినా సకాలంలో పనులు చేయడం లేదు. ఈ విధంగా జరిగితే నేను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తా’ అంటూ గత సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలపై ముఖ్యమంత్రి ఎ¯ŒS.చంద్రబాబు మండిపడ్డారు. పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పడం ఏంటని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం జాతీయ హోదా ఇచ్చినా.. పనులు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కోరికపై రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న ట్రా¯Œ్సట్రాయ్ సంస్థ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందినది కావడంతో పనుల విషయంలో వత్తిడి తెచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పనులను ఒక్కొక్కటిగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రతి సోమవారం వర్చువల్ ఇ¯ŒSస్పెక్ష¯ŒS పేరుతో పనులు వివరాలను జల వనరుల శాఖాధికారులు సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధుల నుంచి తెలుసుకుంటున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశిస్తూనే ఉన్నారు. ప్రతినెలా 3వ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సమీక్షలు జరిపి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రెండు నెలలుగా మరీ మందగించాయి. ప్రధానంగా స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించగా.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. డిసెంబర్‌లో అయినా కాంక్రీట్ పనులు ప్రారంభమవుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పిల్‌వే నిర్మాణానికి సంబం««ధించి ఇంకా 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు చేయాల్సి ఉంది. ఇందులో డిసెంబర్ 10వ తేదీ నాటికి సగం, జనవరి నెలాఖరుకు పూర్తిగా పనులు చేయాలి. స్పిల్ చానల్‌కు సంబం«ధించి ఇంకా మూడు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు చేయాల్సి ఉంది. రోజు 1.50 క్యూబిక్ మీటర్ల మట్టి, రాళ్లను తొలగిస్తున్నారు. డంపింగ్ యార్డు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రైతులకు నష్టపరిహారం విషయం తేల్చకుండానే పనులు చేపట్టడంతో అవి ఎంతవరకూ ముందుకు సాగుతాయో తెలియని పరిస్థితి. పవర్ హౌస్‌కు సంబంధించి 30వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు జరుగుతున్నాయి. స్పిల్‌వే ఫౌండేష¯ŒS పనులు ప్రారంభించాలంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు రావాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఈ బృంద సభ్యులు పరిశీలించి వెళ్లారు. ప్రతిసారి ముఖ్యమంత్రి పర్యటనకు ముందు పనులు వేగం పెంచుతున్నారు. ఆయన వెళ్లాక సాదాసీదాగా సాగుతున్నాయి. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో పురోగతి అంతంత మాత్రంగా ఉంది. సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం రానున్న నేపథ్యంలో పనులు ఊపందుకుంటాయా.. ఎప్పటిలా మొక్కుబడి సమీక్షతో సరిపెడతారో వేచి చూడాల్సిందే.
చంద్రబాబు పర్యటన ఇలా
ఏలూరు సిటీ : ముఖ్యమంత్రి ఎ¯ŒS.చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు గంటలు ముందుగా జిల్లాకు వస్తారు. ఉదయం 8.30 గంటలకు సీఎం విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి 9 గంటలకు చేరుకుంటారు. అక్కడ 5 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి అధికారులతో చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటల వరకు పనులను పరిశీలించి ఇరిగేష¯ŒS అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలవరం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ బయలుదేరతారు.
Advertisement
Advertisement