సిడ్నీ: క్వీన్ ఎలిజబెత్-2 స్వదస్తూరితో రాసిన ఓ లేఖ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ లేఖను ఇంతవరకు ఎవరూ చదివింది లేదు. అలాగే.. భద్రంగా ఓ చోట ఉండిపోయింది. మరి రాణి చనిపోయింది కదా!. అది అలాగే రహస్యంగా ఉండిపోవాల్సిందేనా?..
1986 నంబర్‌లో సిడ్నీ(ఆస్ట్రేలియా) ప్రజలను ఉద్దేశించి.. క్వీన్ ఎలిజబెత్-2 ఓ లేఖ రాశారు. దానిని సిడ్నీలోని ఓ చారిత్రక భవనం వ్యాలెట్‌లో భద్రంగా దాచారు. అయితే.. అందులో ఏముందనే విషయం అది రాసిన రాణివారికి తప్పా ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆమె మరణించడంతో ఆ లెటర్‌ను బయటకు తీయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.
అయితే ఆ లెటర్‌ను తెరుస్తారట. అది ఇంకా 63 ఏళ్ల తర్వాత. అంటే.. 2085లో. సిడ్నీ లార్డ్ మేయర్‌ను ఉద్దేశిస్తూ.. ఎలిజబెత్ రాణి 2 ఆ లేఖను ‘‘2085వ సంవత్సరంలో ఓ మంచి ముహూర్తాన ఆ లేఖను తెరవండి అంటూ ఎలిజబెత్ రాణి సంతకం చేశారు. దీంతో ఆమె కోరిక మేరకు అప్పటివరకు గ్లాస్ బాక్స్‌లో ఉన్న ఆ లేఖను అలాగే ఉంచాలని సిడ్నీ అధికారులు నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో క్వీన్ ఎలిజబెత్-2కు ప్రత్యేక అనుబంధం ఉంది. పదహారుసార్లు ఆమె ఆ దేశాన్ని సందర్శించారు. 1901లో ఆస్ట్రేలియా స్వాతంత్రం ప్రకటించుకుంది. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగారు. 1999లో ఆమెను ఆ దేశ అధినేతగా తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ, అది వీగిపోయింది.
ఇదీ చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువెంతంటే..
Comments
Please login to add a commentAdd a comment