భూమిలోపలి ‘ఐరన్ కోర్’ రహస్యం ఇదే..
లండన్: భూమి పొరల్లో ఉండే ఐరన్ కోర్ కరిగిపోకుండా ఘనపదార్థంలాగే ఉండటం వెనుక గల కారణాన్ని పరిశోధకులు గుర్తించారు. సూర్యుడి ఉపరితలం కంటే భూమిలో పలి పొరల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇంత వేడిగా ఉన్నప్పటికీ అక్కడ ఉండే ఐరన్ కోర్ కరిగిపోకుండా ఉండటానికి గల గుట్టును ఛేదించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశో ధనలు నిర్వహిస్తున్నారు. దీనికి గల కారణా న్ని స్వీడన్‌లోని కేటీహెచ్ రాయల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధ కులు గుర్తించారు.
భూమిలోపలి ఐరన్ కోర్ కేంద్రభాగంలోని స్ఫటిక నిర్మాణాలు కరిగి కోర్‌లోని అంచుభాగానికి వెళతాయి. అక్కడి పీడనం కారణంగా మళ్లీ అవి కేంద్ర భాగానికి వచ్చి చేరతాయి. దీంతో కోర్‌లోని కేంద్ర భాగం ఎల్లప్పుడూ తటస్థంగా ఘన రూపం లోనే ఉంటోందని శాస్త్రవేత్త అనాటోలీ వివరించారు. దీని వల్లే అక్కడ ఎంత అధికంగా ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఐరన్ కోర్ ఘనరూపం లోనే ఉంటోందన్నారు. భూ ఉపరితలం కంటే ఐరన్ కోర్ వద్ద పీడనం 35 లక్షల రెట్లు ఎక్కువని, 6వేల డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత ఉంటుందన్నారు.