
కొవ్వు కరిగే రహస్యాన్ని చెబుతున్న తమన్నా
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్ తమన్నా ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను మిల్కీబ్యూటీ అనిపిలుస్తారంటే ఆమె అందం ఎంత సుకుమారమో అర్ధమైపోతుంది. బాహుబలిలో సన్నటి మెరుపు తీగలా కనిపించిన ఈ ముద్దు గుమ్మ అదే సమయంలో పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపిస్తూ యుద్ధ విన్యాసాలు ఎంతో చక్కగా చేసి మెప్పించారు.
ఇది చూసిన ఎవరికైనా తమన్నా తన ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తారని, భారీగా వర్క్‌వుట్‌లు కూడా చేస్తారని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆరోగ్యవంతమైన, జిమ్‌లో గడపడం వంటి విషయాలు పక్కనబెడితే ఆమె ఓ కప్పు కాఫీతోనే తన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారంట. అయితే, మాములు కాఫీ కాదు.. బటర్ కాఫీ.. సాధారణంగా మనం బటర్ మిల్క్ వింటాంగానీ, ఈ బటర్ కాఫీ ఏమిటి అని ప్రశ్నించగా ఇది తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. కాఫీలో బటర్ మిక్స్ చేసి తాగితే కొవ్వుమొత్తం కరిగి పోతుందని, హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెప్పారు. తన రోజును బటర్ కాఫీతోనే ప్రారంభిస్తానంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment