Kriti Sanon Promises To Reveal Secret With Fans On Her Birthday - Sakshi

Kriti Sanon: చాలా రోజులుగా ఆ విషయాన్ని దాచిపెట్టా: కృతి సనన్

Published Wed, Jul 26 2023 4:34 PM | Last Updated on Wed, Jul 26 2023 5:05 PM

Adipurush Actress Kriti Sanon Reveals Secret With Fans On her Birthday - Sakshi

బాలీవుడ్ భామ కృతి సనన్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు.  దిల్లీకి చెందిన ముద్దుగుమ్మ ఆదిపురుష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఆదిపురుష్  జూన్ 16 రిలీజ్‌ కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ భామకు నిరాశే ఎదురైంది. అంతకుముందే మహేశ్ బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అల వైకుంఠపురములో రీమేక్‌గా వచ్చిన షెహజాదా చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఘనపత్‌ పార్ట్-1లో నటించనుంది. 

(ఇది చదవండి: 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2' ఓటీటీ డేట్‌ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?)

తాజాగా కృతి సనన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈనెల 27న తన బర్త్‌ డే సందర్బంగా ఓ సీక్రెట్‌ను రివీల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదేంటో అభిమానులు గెస్ చేయండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియోలో హెచ్‌ లెటర్‌తో మొదలవుతుందని క్లూ ఇచ్చేసింది భామ.

అయితే ఇది చూసిన అభిమానులు బ్యూటీకి సంబంధించి యాడ్ గురించేనా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఎవరా లక్కీ గాయ్.. అంటూ పోస్టులు పెడుతున్నారు.   కొందరు ఫ్యాన్స్ ఏకంగా ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నావా?.. లేకపోతే ప్రభాస్ అన్నను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. కొందరు నెటిజన్స్ అయితే కొత్త మూవీ గురించి అప్‌డేట్‌ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కృతి సనన్ తన పుట్టిన రోజు అభిమానులకు ఓ సీక్రెట్‌ రివీల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కృతి సనన్ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement