సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ షాక్ తగలింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందునే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.
కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. తాను వేధింపులకు గురి చేసిన విషయం ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేశాను. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని బాధితురాలు డిమాండ్ చేసింది.
..ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు అని కన్నీరు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment