Satyavedu Assembly Constituency
-
ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!
సాక్షి, చిత్తూరు జిల్లా: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతుండగా, ఈ క్రమంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలుమరోవైపు, ఈ కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.కాగా, బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. -
'పవర్ రేపిస్ట్' అంటూ పూనమ్ కౌర్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పలు సంఘటనల్లో ఆమె వెంటనే రియాక్ట్ అవుతారు. సత్యవేడుకు చెందిన ఒక మహిళ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మీద తాజాగా పూనమ్ సంచలన ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది."పవర్ రేపిస్ట్"ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను అభినందిస్తున్నానంటూ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేశారు. అతను అలా తన భార్యకు అండగా లేకుండా ఉండుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఇలాంటి సంఘటన ఎదురైతే అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా ఉండమని చెబుతారు.. కానీ, అతను తన భార్యను సపోర్ట్ చేస్తూ తప్పును బహిర్గతం చేశాడు.తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు నా కృతజ్ఞతలు. అత్యాచారానికి గురైన మహిళ దైర్యంగా బయటికొచ్చి మాట్లాడిన ఆ మహిళను అభినందిస్తున్నాను.' అని పూనమ్ పేర్కొన్నారు.పూనమ్ కౌర్ చేసిన 'పవర్ రేపిస్ట్' అనే వ్యాఖ్యం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు నెట్టింట పెద్ద దుమారమే రేగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. సత్యవేడు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న బాధిత మహిళ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలతో పాటు వీడియోలను విడుదల చేసింది. ఆయన తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారం చేశారని చెబుతూ ఆమె మీడియా ముందుకు వచ్చింది.Highly appreciative of the husband who encouraged his partner to expose the “ POWER RAPIST” - had he not done that - the MLA from #TDP wouldn’t have be suspended - many would just say they in power keep quiet - kudos to him 🙏 and the woman who exposed him - gives hope . 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 5, 2024 -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. టీడీపీ నుంచి ఆదిమూలం సస్పెండ్
సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ షాక్ తగలింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందునే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. తాను వేధింపులకు గురి చేసిన విషయం ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేశాను. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని బాధితురాలు డిమాండ్ చేసింది...ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు అని కన్నీరు పెట్టుకుంది. -
Koneti Adimulam: కండువా కప్పుకోక ముందే తీవ్ర అవమానం
సత్యవేడు నియోజకవర్గంలోని ఆశావహులతో చంద్రబాబునాయుడు చెడుగుడు ఆడుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్లు చేసి నువ్వే అభ్యరి్థవంటూ నమ్మబలుకుతున్నారు. ఆపై ఎవ్వరికీ తెలియకుండా తన వాయిస్‌తో వేరొక అభ్యరి్థత్వాన్ని తెరపైకి తెచ్చి ఫోన్ సర్వే చేయిస్తున్నారు. ఇన్నాళ్లూ బాబు మాటలు నమ్మి.. ఆయన హామీలకు తలొగ్గి తీరా మోసపోతామేమోన్న ఆందోళనలో ఎస్సీ అభ్యర్థులు తికమకపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం పరిస్థితి అయితే రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని తెలుగులు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. సాక్షి, తిరుపతి: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్యవేడు టీడీపీ టికెట్ విషయమై జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్కే టికెట్ అని చంద్రబాబు తన వారితో ప్రచారం చేయించారు. 2019 ఎన్నికల్లో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలైన జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య తనకే టికెట్ అని, చంద్రబాబు కూడా స్పష్టం చేశారని వారు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ మేరకు చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని, అందుకే పార్టీ మారుతున్నట్లు తన అనుచరులకు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చంద్రబాబు వాయిస్ రికార్డుతో మొబైల్ ఫోన్ ద్వారా చేపట్టిన సర్వేలో మాజీ ఎమ్మెల్యే గాంధీ మనుమరాలు చందన స్రవంతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సర్వేలో స్రవంతి పేరు తప్ప మరొకరి ప్రస్తావన లేకపోవడంతో ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి మోసం చేస్తావా? అంటూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత నేతలు చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుపోటుకు సిద్ధమైన ఆదిమూలం వ్యతిరేకత విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే ఆదిమూలం ఈసారి తనకు స్థాన చలనం తప్పదని భావించి, టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై, ప్రభుత్వ పెద్దలపై అసత్యప్రచారం చేయడం ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డిపై మరీ చెలరేగిపోయారు. అయినా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే ఆదిమూలంకి ప్రమోషన్ ఇచ్చి తిరుపతి పార్లమెంట్ ఇన్చార్జ్గా ప్రకటించారు. దీన్ని బూతద్దంలో చూపించేందుకు ప్రయతి్నంచి భంగపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదిమూలం, కొడుకు సుమన్‌ని మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తికి పిలుచుకుని మంతనాలు నెరిపారు. కండువా కప్పుకోక ముందే తీవ్ర అవమానం ఎమ్మెల్యే ఆదిమూలం, కొడుకు సుమన్ టీడీపీ కండువా కప్పుకోకముందే తీవ్ర అవమనాలు ఎదుర్కొంటున్నారు. నెలరోజులవుతున్నా కనీసం చంద్ర బాబునాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే దు. ఆదిమూలంకి సత్యవేడు అభ్యరి్థత్వం కూడా లే నట్టేనని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదిమూలం రెంటికీ చెడ్డరేవడేనా? తాజా సర్వేతో ఆదిమూలం ప్రస్తావనే లేకపోవడంతో ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోనేటి ఆదిమూలం 2001లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆపై 2004, 2009లో టికెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత వైఎస్సార్సీపీలో చేరి, 2014లో సత్యవేడు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019లో వైఎస్.జగన్మోహన్రెడ్డి తిరిగి ఆదిమూలంనే అభ్యర్థిగా ప్రకటించి కోనేటి కుటుంబానికి ఊపిరిపోశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజాసేవపై దృష్టి సారించకపోవడం, ఎస్సీ సామాజికవర్గాన్నే చిన్నచూపు చూడడం, తన కుమారుడు సుమన్ అధికారులు, స్థానికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిపై చేయిచేసుకోవడం వంటి కారణాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది.