సత్యవేడు నియోజకవర్గంలోని ఆశావహులతో చంద్రబాబునాయుడు చెడుగుడు ఆడుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్లు చేసి నువ్వే అభ్యరి్థవంటూ నమ్మబలుకుతున్నారు. ఆపై ఎవ్వరికీ తెలియకుండా తన వాయిస్‌తో వేరొక అభ్యరి్థత్వాన్ని తెరపైకి తెచ్చి ఫోన్ సర్వే చేయిస్తున్నారు. ఇన్నాళ్లూ బాబు మాటలు నమ్మి.. ఆయన హామీలకు తలొగ్గి తీరా మోసపోతామేమోన్న ఆందోళనలో ఎస్సీ అభ్యర్థులు తికమకపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం పరిస్థితి అయితే రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని తెలుగులు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.
సాక్షి, తిరుపతి: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్యవేడు టీడీపీ టికెట్ విషయమై జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్‌కే టికెట్ అని చంద్రబాబు తన వారితో ప్రచారం చేయించారు. 2019 ఎన్నికల్లో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలైన జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య తనకే టికెట్ అని, చంద్రబాబు కూడా స్పష్టం చేశారని వారు చెప్పుకుంటున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ మేరకు చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని, అందుకే పార్టీ మారుతున్నట్లు తన అనుచరులకు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చంద్రబాబు వాయిస్ రికార్డుతో మొబైల్ ఫోన్ ద్వారా చేపట్టిన సర్వేలో మాజీ ఎమ్మెల్యే గాంధీ మనుమరాలు చందన స్రవంతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సర్వేలో స్రవంతి పేరు తప్ప మరొకరి ప్రస్తావన లేకపోవడంతో ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి మోసం చేస్తావా? అంటూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత నేతలు చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెన్నుపోటుకు సిద్ధమైన ఆదిమూలం
వ్యతిరేకత విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే ఆదిమూలం ఈసారి తనకు స్థాన చలనం తప్పదని భావించి, టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీపై, ప్రభుత్వ పెద్దలపై అసత్యప్రచారం చేయడం ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డిపై మరీ చెలరేగిపోయారు. అయినా వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆదిమూలంకి ప్రమోషన్ ఇచ్చి తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. దీన్ని బూతద్దంలో చూపించేందుకు ప్రయతి్నంచి భంగపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదిమూలం, కొడుకు సుమన్‌ని మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తికి పిలుచుకుని మంతనాలు నెరిపారు.
కండువా కప్పుకోక ముందే తీవ్ర అవమానం
ఎమ్మెల్యే ఆదిమూలం, కొడుకు సుమన్ టీడీపీ కండువా కప్పుకోకముందే తీవ్ర అవమనాలు ఎదుర్కొంటున్నారు. నెలరోజులవుతున్నా కనీసం చంద్ర బాబునాయుడు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలే దు. ఆదిమూలంకి సత్యవేడు అభ్యరి్థత్వం కూడా లే నట్టేనని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆదిమూలం రెంటికీ చెడ్డరేవడేనా?
తాజా సర్వేతో ఆదిమూలం ప్రస్తావనే లేకపోవడంతో ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోనేటి ఆదిమూలం 2001లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆపై 2004, 2009లో టికెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి, 2014లో సత్యవేడు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ఆదిమూలంనే అభ్యర్థిగా ప్రకటించి కోనేటి కుటుంబానికి ఊపిరిపోశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజాసేవపై దృష్టి సారించకపోవడం, ఎస్సీ సామాజికవర్గాన్నే చిన్నచూపు చూడడం, తన కుమారుడు సుమన్ అధికారులు, స్థానికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిపై చేయిచేసుకోవడం వంటి కారణాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment