
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు(23న) వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా భందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపింది.
స్ట్రాంగ్ రూంల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని వెల్లడించింది. కౌంటింగ్‌కు ఆటంకాలు కల్పించే విధంగా హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేసే అవకాశముందని, ఈ విషయంలో అన్నిరాష్ట్రాలు గట్టి భద్రతా చర్యలను చేపట్టాలని సూచన చేసింది.