States governments
-
ఉచిత హామీలపై ఈసీ ఆందోళన
-
భావి అవసరాలకనుగుణంగా విద్యుదుత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ అవసరాలకనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉజ్వల్ భారత్–ఉజ్వల్ భవిష్యత్తు– విద్యుత్ 2047 గ్రాండ్ ఫినాలే సదస్సులో వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున విశాఖపట్నంలో ఈ మహోత్సవ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వినియోగదారులకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా మరో 1,600 మెగావాట్లు 2023 జనవరి నాటికి రానుందన్నారు. అదేవిధంగా.. 2024–2026 వరకూ వివిధ దశల్లో పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి 10,067 లేఅవుట్లను విద్యుదీకరించేందుకు రూ.3,483 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ జలకళ పథకంలో భాగంగా రూ.180 కోట్లతో 6,669 బోర్లుకు కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ థర్మల్ అండ్ కోల్ కోఆర్డినేషన్ జాయింట్ సెక్రటరీ పీయూష్ సింగ్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు: ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్ వెలుగులు అందించడమే లక్ష్యంగా.. పాతికేళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పథకాల్ని ప్రవేశపెట్టామన్నారు. విద్యుదీకరణ ప్రజల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నా.. డిస్కంలు సబ్సిడీలు కొనసాగిస్తుండటం భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టేసేందుకు సూచికలని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలకు 2021–22 నుంచి 2025–26 వరకు మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. దీని ద్వారా ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై – ఏవరేజ్ రెవెన్యూ రియలైజ్డ్ అంతరాన్ని 2024–25 కల్లా సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. డిస్కంలు, విద్యుత్ విభాగాల నిర్వహణ సామర్థ్యాల్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్æ స్కీమ్‌ని ప్రధాని ప్రారంభించారు. అదేవిధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి చెందిన రూ.5,200 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్ని జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యం గల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌తోపాటు దేశంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. చింతపల్లి గిరిజనుడితో ప్రధాని ముఖాముఖి.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీకి చెందిన గిరిజన లబ్ధిదారుడు కాగే క్రాంతికుమార్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. ప్రధాని: క్రాంతికుమార్ ఎలా ఉన్నావ్? క్రాంతికుమార్: చాలా బాగున్నాను సార్ ప్రధాని: మీ గురించి చెప్పండి క్రాంతికుమార్: మాది సుదూర గిరిజన గ్రామం.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీ ప్రధాని: మీ ఊరికి కరెంట్ రాకముందు, వచ్చిన తర్వాత ఏం తేడా గమనించావు? క్రాంతికుమార్: గతంలో సూర్యుడి వెలుగు ఉన్నంతవరకే ఏ పనైనా చేసుకునేవాళ్లం. రాత్రిపూట కిరోసిన్ దీపాలతో ఇళ్లల్లోనే ఉండేవాళ్లం. చదువు కోసం పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద మా ఊరికి కరెంట్ వచ్చింది. మా జీవితాలు చాలా బాగుపడ్డాయి. ప్రధాని: చాలా సంతోషంగా ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు గర్వపడుతున్నాం. మరింత నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. క్రాంతికుమార్: థాంక్యూ సార్. -
కరోనా అలర్ట్: నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియెంట్ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్డౌన్, అమెరికాతో పాటు దక్షిణాసియా పరిధిలోని కొన్ని దేశాల్లో(దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో పరిస్థితి మరీ దారుణం).. కొన్ని యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జనాలు ఇస్టానుసారం తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల్లో కేసుల విజృంభణనను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్ఫెక్షన్ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, శుభ్రతా తదితర సూచనలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్‌లెన్స్‌ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. కరోనాలో కొవిడ్ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్‌లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది. -
ఇక జీఎస్టీ మూడు శ్లాబులేనా.. వాటి ధరలు పెరగనున్నాయా?
జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో అతి తక్కువ పన్ను శ్లాబ్ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఆదాయాలు పెరిగి రాష్ట్రాలు నష్ట పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడకుండా ఉండటానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో మార్పులు చేయాలని చూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతి తక్కువ శ్లాబ్ 5 శాతంను పెంచడంతో పాటు ఆదాయాన్ని పెంచడానికి వివిధ చర్యలను సూచిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం ఈ నెల చివరినాటికి తన నివేదికను జీఎస్టీ మండలికి సమర్పించే అవకాశం ఉంది. 5 నుంచి 8కి.. ప్రస్తుతం, జీఎస్టీ కింద 5, 12, 18 & 28 శాతం పన్ను రేటు గల 4 శ్లాబులు ఉన్నాయి. కొన్ని అత్యావశ్యక వస్తువులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తే, మరికొన్ని వాటి మీద అతి తక్కువ మాత్రమే పన్ను విధిస్తున్నారు. ఇంకా లగ్జరీ, డీమెరిట్ ఐటమ్ ఉత్పత్తులకు అత్యధికంగా 28 శాతం పన్ను వర్తిస్తుంది. జీఎస్టీ తీసుకొచ్చిన కారణంగా రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి కొత్తగా జీఎస్టీ పన్ను వ్యవస్థలో మార్పు చేయాలని కేంద్రం భావిస్తుంది. 5 శాతం శ్లాబును 8 శాతానికి పెంచడం ద్వారా కేంద్రానికి అదనంగా రూ.1.50 లక్షల కోట్ల వార్షిక ఆదాయం రావచ్చు అని అధికార వర్గాలు తెలిపాయి. ఆ సంఖ్యను కూడా తగ్గించాలి ప్రధానంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై విధిస్తున్ శ్లాబును 1 శాతం పెంచడం ద్వారా వార్షికంగా రూ.50,000 కోట్ల ఆదాయ లాభం లభిస్తుంది. హేతుబద్ధీకరణలో భాగంగా 5 శాతం రేటును 8 శాతంగాను, 12 శాతం రేటు గల వస్తువులను 18 శాతం శ్లాబులో కలపాలని, 28 శాతం రేటును యధాతథంగా ఉంచాలని కేంద్రం భావిస్తుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించే అన్ని వస్తువులు మరియు సేవలు 18 శాతం శ్లాబ్ కిందకు మారతాయి. అంతేకాకుండా, జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తువుల సంఖ్యను తగ్గించాలని కూడా జివోఎం ప్రతిపాదించింది. జూన్ నెలతో గడువు ముగింపు ప్రస్తుతం అన్ ప్యాకేజ్డ్, అన్ బ్రాండెడ్ ఫుడ్ & డైరీ ఐటమ్స్'కు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో సమావేశమై జివోఎం నివేదికపై చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని వర్గాలు తెలిపాయి. గత కొన్ని ఏళ్లుగా జీఎస్టీ అమలులోకి తీసుకొని రావడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని కేంద్రమే చెల్లిస్తుంది. ఈ ప్రక్రియకు జూన్ నెలతో గడువు ముగిస్తుంది. జీఎస్టీ నష్టపరిహార ప్రక్రియ ముగింపుకు రావడంతో రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్రం జీఎస్టీ పన్ను వ్యవస్థలో మార్పులు చేయాలని భావిస్తుంది. జూలై 1, 2017న జీఎస్టీ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జూన్ 2022 వరకు రాష్ట్రాలకు 5 సంవత్సరాల పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా చేసుకొని సంవత్సరానికి 14 శాతం వృద్దిని పరిగణలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని కేంద్రం అంగీకరించింది. అయితే, అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. కొన్ని సంవత్సరాలుగా జీఎస్టీ కౌన్సిల్ తరచుగా వాణిజ్యం & పరిశ్రమలకు అనుగుణంగా పన్ను రేట్లను సవరించింది. ఉదాహరణకు, జీఎస్టీ అమలులకి వచ్చిన కొత్తలో 28 శాతం పన్ను శ్లాబుల ఉన్న సంఖ్య 228 అయితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు తగ్గింది. (చదవండి: సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?) -
ముప్పు వచ్చేస్తొంది.. కోవిడ్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ
ఢీల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కఠిన చర్యలు చేపట్టినా భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైంది. ఓ పక్క వైరస్ అడ్డుకట్టకు టీకా కీలకమని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులు అహర్నిశలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కష్టపడుతున్నారు. మరో వైపు కోవిడ్ చాప కింద నీరులా పాకుతూ దేశవ్యాప్తంగా తన ఉనికిని మళ్లీ చాటేందుకు చూస్తోంది. దీంతో ఆప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కోవిడ్‌పై పలు కీలక సూచనలు చేస్తూ లేఖ రాసింది. అందులో.. కోవిడ్ నివారణ చర్యలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. జిల్లా, సబ్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలిని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలికవసతులు, పడకల లభ్యత చూసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి తగిన వైద్య సూచనలు చేయాలిని ఆదేశించింది. చదవండి: Passengers From Italy Tested Positive Amritsar: కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా.. -
జీఎస్టీ లోటు భర్తీ...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లోటును భర్తీ చేయడానికి కేంద్రం గురువారం రూ.44,000 కోట్లను రుణంగా రాష్ట్రాలకు విడుదల చేసింది, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా నిధుల విడుదల పరిమాణం మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. నిధులను బ్యాక్–టు–బ్యాక్ లోన్లుగా విడుదల చేయడం... సెస్ వసూళ్ల నుండి ఇచ్చే ద్వైమాసిక జీఎస్టీ పరిహారానికి అదనం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 1.59 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపాలని, ఈ నిధులను (జీఎస్టీ పరిహార నిధిలో లోటు భర్తీకి) వనరుల అంతరాన్ని తీర్చడానికి ఒక బ్యాక్–టు–బ్యాక్ ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని ఈ ఏడాది మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ విధంగా ఇదే విధానం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రూ. 1.10 లక్షల కోట్లు విడుదల చేసింది. -
సర్వే: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం
ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు. ► మొత్తం జీఎస్డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం. ► 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది. ► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. ► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది. ► తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది. అధిక ద్రవ్యోల్బణం, బేస్ పెంపు ద్వారా జీఎస్టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది. ► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్ రేటింగ్స్ ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్ రేటింగ్స్ పేర్కొంది. చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం -
పండుగలప్పుడు ఆంక్షలు పెట్టండి!
న్యూఢిల్లీ: కోవిడ్19 వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుగా రాబోయే పండుగల సందర్భంగా స్థానికంగా ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మొహర్రం (ఆగస్టు 19), ఓనం (ఆగస్టు 21), జన్మాష్టమి (ఆగస్టు 30), వినాయక చవితి (సెప్టెంబరు 10), దుర్గా పూజ (దసరా నవరాత్రులు, అక్టోబరు 5-15) లకు జనం గుంపులుగా ఒకేచోట చేరకుండా చూడాలని, స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు. పండుగల సందర్భంగా జనం పెద్దసంఖ్యలో ఒకేచోటికి చేరితే... సూపర్ స్ప్రెడర్గా అవి మారే అవకాశం ఉంటుందని, కోవిడ్ కేసులు పెరిగిపోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. సెకండ్ వేవ్‌లో కేసుల వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు చేసిన కృషిని అభినందించారు. -
అన్ లాక్ అంశంపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
-
రెండో విడత జీఎస్టీ పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా రెండవ దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడదుల చేసింది. మరో 6 వేల కోట్ల రూపాయలనుకేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసింది. వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 4.42 శాతం వడ్డీ రేటుతో అరువు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హరియానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్‌లకు ఈ మొత్తాన్ని పంపించినట్లు ఆర్థిక శాఖ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. (లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు) ప్రత్యేక విండో కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన 12,000 కోట్ల రూపాయల రుణాల్లో భాగంగా తాజా చెల్లింపులు చేయనుంది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు 6000 కోట్ల రూపాయలను రెండవ సారి విడుదల చేయనుంది. మరోవైపు రూ.1.05 లక్షల కోట్ల వద్ద అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిని తాకాయి.చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు.ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. Ministry of Finance, under its, “Special Window to States for meeting the GST Compensation Cess shortfall,” will be releasing an amount of ₹6000 cr as second tranche to 16 States and 3 Union Territories today. (1/4) Read more ➡️ https://t.co/IkTkXLiYO3@nsitharamanoffc — Ministry of Finance (@FinMinIndia) November 2, 2020 -
ఇక రాష్ట్రాలదే నిర్ణయం!
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి కరోనా కేసులు, విస్తృతిని దృష్టిలో పెట్టుకుని కంటెయిన్మెంట్ జోన్లు, ఇతర ఆంక్షలు, సడలింపుల విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే, దాదాపు 80% పాజిటివ్ కేసులు ఉన్న 30 మున్సిపల్ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించే అవకాశముంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఒడిశాల్లో ఈ 30 మున్సిపల్ ఏరియాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల గురించి కేంద్రం ఎక్కువగా ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు, సామూహికంగా ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తదితరాలపై నిషేధం కొనసాగే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించవచ్చన్నారు. విద్యాసంస్థలు, మెట్రో ట్రైన్ సేవలు, ప్రార్థనాస్థలాల పునఃప్రారంభంపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసే అవకాశముందన్నారు. లాక్డౌన్ అమలుపై రాష్ట్రాలతో ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లను పునఃప్రారంభించేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని ఇటీవలే కర్ణాటక సీఎం యెడియూరప్ప చెప్పిన విషయం గమనార్హం. మార్చి 25 నుంచి పలు దశల్లో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలుగో దశ మే 31తో ముగియనుంది. లాక్డౌన్ ప్రభావం, మే 31 తరువాత ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు పోషించాల్సిన పాత్రపై ఇప్పటికే కేంద్రం లోతుగా చర్చిస్తోంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 30 నగరాల్లో 13 నగరాల మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లతో గురువారం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆన్లైన్ భేటీ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. ఆ 13 నగరాల్లో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానె, పుణె, కోల్‌కతా, జైపూర్, హౌరా, తిరువళ్లూరు మొదలైనవి ఉన్నాయి. కరోనా, లాక్డౌన్లకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి ఏయే రంగాల్లో ఆంక్షలను సడలించాలనే విషయంలో వారి సూచనలు తీసుకున్నారు. చాలామంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పరిమిత స్థాయిలో కొనసాగించాలనే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో మాట్లాడిన అనంతరం.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడగించే అవకాశమున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో దేవాలయాలు ఓపెన్! దేశవ్యాప్త లాక్డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుందనగా.. రాష్ట్రంలో పలు ఆంక్షలను సడలిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనాస్థలాలను జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. జూన్ 8 నుంచి ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు 100% హాజరుతో పని చేస్తాయన్నారు. ప్రార్థనా మందిరాల్లో గుంపులుగా గుమికూడవద్దని, 10 మందికి మించి ఒకేసారి లోపలికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. తేయాకు, జౌళి పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. భౌతిక దూరం నిబంధనలను పాటించకుండా, వలసకార్మికులతో కిక్కిరిసిన రైళ్లను పశ్చిమబెంగాల్‌కు పంపడంపై రైల్వే శాఖపై మండిపడ్డారు. -
మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను వణికిస్తున్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన వాయు కాలుష్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలు, వారి రక్షణ పట్టదా అని సుప్రీం బుధవారం మండిపడింది. సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు (రాష్ట్రాలు) మర్చిపోయారా? పేద ప్రజల గురించి బాధపడటం లేదు, ఇది చాలా దురదృష్టకరమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రజల గురించి పట్టించుకోనివారికి అధికారంలో ఉండే హక్కు లేదు వ్యాఖ్యానించింది. "కాలుష్యం కారణంగా ప్రజలు ఇలా చనిపోవడానికి మీరు అనుమతించగలరా? దేశాన్ని100 సంవత్సరాల వెనక్కి వెళ్ళడానికి మీరు అనుమతించగలరా" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను దహనం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రైతులను బాధ్యుల్ని చేయడం భావ్యం కాదని తెలిపింది. ఇది కోట్లాదిమంది ప్రజల జీవన్మరణ సమస్య. ఇందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి" అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పంట వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు, వాటిని ఉపయోగించుకునేందుకు తమ వద్ద యంత్రాంగం, నిధులు లేవని, రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని పంజాబ్ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకు నివేదించడంతో..మరోసారి మండిపడిన జస్టిస్ మిశ్రా..మీ వద్ద నిధులు లేకపోతే..మేమే మీకు నిధులు అందజేస్తామని, కేంద్రంపై ఆధారపడటం మాను కోవాలని, మీరు ఏమీ చేయలేకపోతే..ఆ విషయాన్ని కోర్టులకు వదిలేయాలని స్పష్టం చేశారు. విమానాల దారి మళ్లింపు, ప్రజలు తమ నివాసాల్లో కూడా సురక్షితంగా ఉండకపోవడంపై మీకు సిగ్గు అనిపించడం లేదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు భవంతుల్లో (ఐవరీ టవర్స్) కూర్చుంటే సరిపోతుందా..?కోట్లాది ప్రాణాలకు సంబంధించిన విషయంపైనా సరైన విధంగా స్పందించరా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు భవంతుల్లో కూర్చుని ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే.. మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.. మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వాధినేతలకు స్పష్టం చేసింది. ఈ విషయంలో తక్షణ చర్యలను ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు(23న) వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా భందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపింది. స్ట్రాంగ్ రూంల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని వెల్లడించింది. కౌంటింగ్‌కు ఆటంకాలు కల్పించే విధంగా హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేసే అవకాశముందని, ఈ విషయంలో అన్నిరాష్ట్రాలు గట్టి భద్రతా చర్యలను చేపట్టాలని సూచన చేసింది. -
రిటైల్ ఎఫ్‌డీఐలపై కేంద్రంతో రాష్ట్రాల భేటీ
న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడంపై రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం సమావేశం నిర్వహించింది. రిటైల్, ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐల విషయంలో ఇటు చిన్న రిటైలర్లు, అటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం అన్నది దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రానికి రాష్ట్రాలు సూచించాయి. ఏది ఏమైనప్పటికీ దీనిపై రాష్ట్రాల స్థాయిలో సంబంధిత వర్గాలతో కూలంకుషంగా చర్చించిన తర్వాతే అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు హర్యానా ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు తెలిపారు. అన్ని రాష్ట్రాలు 15 రోజుల్లోగా మల్టీబ్రాండ్ రిటైల్, ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలపై తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలపాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు హాజరు కాలేదు.