మైనారిటీ శాఖ పరిధిలో ‘లింగాయత్‌’ హోదా | Ministry of Home Affairs steers clear, says minority affairs ministry to take a call | Sakshi
Sakshi News home page

మైనారిటీ శాఖ పరిధిలో ‘లింగాయత్‌’ హోదా

Published Fri, Apr 6 2018 3:00 AM | Last Updated on Fri, Apr 6 2018 3:00 AM

Ministry of Home Affairs steers clear, says minority affairs ministry to take a call - Sakshi

న్యూఢిల్లీ: లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించే అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మైనారిటీ వ్యవహారాల శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని హోంశాఖ గురువారం వెల్లడించింది. అయితే.. కర్ణాటకలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున మైనారిటీ హోదాపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోమని హోంశాఖ ప్రతినిధి తెలిపారు. ‘మత హోదాపై నిర్ణయం తీసుకోవటం హోంశాఖ పరిధిలోకి రాదు. అందుకే దీన్ని మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశాం. కర్ణాటక సర్కారు ప్రతిపాదనను పరిశీలించటం, నిర్ణయం తీసుకోవటంలో మైనారిటీ శాఖకే పూర్తి అధికారాలున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement